తోటి స్త్రీలను వ్యభిచారంలోకి దించుతున్న మహిళ

ఐరెనేపై బలవంతపు వసూళ్లు, అనేైతికమైన మనుషల తరలింపు ఆరోపణలు కూడా వచ్చాయి. ఐరెనే బాయ్‌ఫ్రెండ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అతను కూడా ఈ వ్యభిచారం వ్యవహారంలో చేయి చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు.
ఉగండా మహిళ చేతిలో మోసపోయిన ముగ్గురు మహిళలు కూడా ప్రస్తుతం ప్రభుత్వ శరణాలయంలో ఉన్నారు. గుర్తింపు వ్యవహారం ముగిసే వరకు ఇక్కడే ఉండాలని పోలీసులు వారిని ఆదేశించారు. ముగ్గురు ఉగండా మహిళలు తనను సంప్రదించారని, సెక్స్, డ్రగ్ రాకెట్ బాధితులుగా తమను వారు చెప్పుకున్నారని, తన సహాయం కోరారని ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి చెప్పిన విషయం తెలిసిందే.
ఉగండా మహిళలకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. గత నెలలో ఆఫ్రికా జాతీయుల ఇళ్లపై తమ పార్టీకి చెందిన మంత్రి చేసిన దాడులు సమర్థనీయమేనని తేలిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications