పక్క గదిలో భర్త, మరో గదిలో ప్రియుడితో రోమాన్స్: వాట్సాప్ లో, భర్త చూస్తే చీల్చేసింది !

Posted By:
Subscribe to Oneindia Telugu

ఆగ్రా: భార్య మొబైల్ లోని వాట్సాప్ లో ఉన్న వివరాలు పరిశీలించిన పాపానికి భార్త తల నివునా చీలిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సమీపంలోని బిలావాలీ ప్రాంతంలో జరిగింది. తల పగిలిపోవడంతో తీవ్రగాయాలైన నేత్రపాల్ సింగ్ (23) అనే యువకుడు ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. అతని తలకు 20కి పైగా కుట్లు వేశామని వైద్యులు అంటున్నారు.

కుమార్తెను కుర్చీలో కట్టేసి పక్కింటి ఆంటీని రేప్ చేశాడు, చివరికి కామాంధుడు !

మొబైల్ లో ఉన్న తన ప్రియుడి వివరాలు తెలుసుకుని ప్రశ్నించిన భర్త నేత్రపాల్ సింగ్ పై హత్యాయత్నం చేసిన భార్య నితూ సింగ్ (21) ను ఖేరాగర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. నీతూసింగ్ తో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని ఖేరాగర్ పోలీసు అధికారి అజయ్ సింగ్ మీడియాకు చెప్పారు.

పెళ్లి జరిగింది !

పెళ్లి జరిగింది !

నేత్రపాల్ సింగ్, నీతూ సింగ్ వివాహం 2014 లో జరిగింది. ఇంత కాలం కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్న నేత్రపాల్ సింగ్ నెల క్రితం ఓ అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టాడు. అయితే నీతూ సింగ్ భర్త ఇంటిలో ఉన్నా సరే ఎక్కువ సేపు తన మొబైల్ లోనే కాలం గడిపేదని సమాచారం.

ప్రియుడు ఉన్నాడు !

ప్రియుడు ఉన్నాడు !

పెళ్లి కాకముందే నీతూ సింగ్ ఓ యువకుడిని ప్రేమించింది. నేత్రపాల్ సింగ్ తో వివాహం అయిన తరువాత నీతూ సింగ్ నిత్యం తన ప్రియుడితో టచ్ లో ఉండేది. నిత్యం వాట్సాప్ లో నీతూ సింగ్ తన ప్రియుడిని సంప్రదిస్తు ఉండేదని సమాచారం.

ఇంటికే రప్పించుకునేది !

ఇంటికే రప్పించుకునేది !

నేత్రపాల్ సింగ్ కుటుంబంలో జరిగే ప్రతి శుభకార్యానికి రావాలని నీతూ సింగ్ తన ప్రియుడికి చెప్పింది. వీరి ఇంటిలో జరిగే శుభకార్యాలకు ప్రియుడు హాజరయ్యేవాడు. భర్త నేత్రపాల్ సింగ్, ఆయన కుటుంబ సభ్యులకు ఇతను మా బంధువు అంటూ నీతూ సింగ్ తన ప్రియుడిని పరిచయం చేసింది.

పక్కగదిలో భర్త, మరో గదిలో రోమాన్స్ !

పక్కగదిలో భర్త, మరో గదిలో రోమాన్స్ !

నేత్రపాల్ సింగ్ కుటుంబంలో జరిగే ఓ శుభకార్యానికి నీతూ సింగ్ ప్రియుడు వచ్చాడు. అందరూ శుభకార్యంలో హడావిడిలో ఉన్నారు. నేత్రపాల్ సింగ్ ఓ గదిలో ఉన్నాడు. అయితే పక్క గదిలో నీతూ సింగ్ ప్రియుడితో రోమాన్స్ చేస్తోంది.

వార్నింగ్ ఇచ్చిన మామ !

వార్నింగ్ ఇచ్చిన మామ !

నీతూ సింగ్ ప్రియుడితో రోమాన్స్ చేస్తున్న సమయంలో నేత్రపాల్ సింగ్ తండ్రి రాజీవ్ సింగ్ విషయం గుర్తించాడు. శుభకార్యం పూర్తి అయిన తరువాత కోడలు నీతూ సింగ్ ను పిలిచి పద్దతి మార్చుకోవాలని సూచించాడు. పెళ్లికి ముందే ప్రియుడు ఉంటే నా కుమారుడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ? అంటూ గట్టిగానే ప్రశ్నించాడు.

పద్దతి మాత్రం మారలేదు !

పద్దతి మాత్రం మారలేదు !

మామ మందలించినా నీతూ సింగ్ పద్దతి మాత్రం మార్చుకోలేదని సమాచారం. వాట్సాప్ లో ప్రియుడితో కాలం గడపడం, భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలుపించుకోవడం జరుగుతోందని తెలిసింది. చివరికి నేత్రపాల్ సింగ్ కు అతని కుటుంబ సభ్యులు భార్య విషయం చెప్పారు.

భార్య మీద అనుమానంతో !

భార్య మీద అనుమానంతో !

భార్య మీద అనుమానంతో నేత్రపాల్ సింగ్ ఆమె మీద నిఘా వేశాడు. భార్య మొబైల్ లాక్కొని పరిశీలించాడు. ఆ సమయంలో నీతూ సింగ్ అభ్యంతరం చెప్పింది. అయితే భార్య మొబైల్ లోని వాట్సాప్ లో వివరాలు, రికార్డింగ్ కాల్స్ పరిశీలించాడు.

తల చీల్చేసింది !

తల చీల్చేసింది !

నా మొబైల్ పరిశీలిస్తావా అంటూ రెచ్చిపోయిన నీతూ సింగ్ వాట్సాప్ లో వివరాలు చూస్తున్న భర్త మీద పెద్ద కర్ర తీసుకుని వెనుక నుంచి దాడి చేసింది. తల చీలిపోవడంతో వెంటనే అతన్ని ఎస్ఎన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి తలకు కుట్లు వేయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు..

ప్రియుడితో ఎస్కేప్ !

ప్రియుడితో ఎస్కేప్ !

భర్త మీద దాడి చేసిన నీతూ సింగ్ తన ప్రియుడితో కలిసి పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే నేత్రపాల్ సింగ్ కుటుంబ సభ్యులు, బంధువులు నీతూ సింగ్, ఆమె ప్రియుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తన మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించడంతో అదే కర్ర తీసుకుని తన భర్త మీద దాడి చేశానని నీతూ సింగ్ నేత్రపాల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పరస్పరం కేసులు !

పరస్పరం కేసులు !

నేత్రపాల్ ఫిర్యాదు మేరకు భార్య నీతూ సింగ్ మీద, నీతూ సింగ్ ఫిర్యాదు మేరకు నేత్రపాల్ మీద ఖేరాగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేత్రపాల్ తండ్రి రాజీవ్ సింగ్ సైతం కోడలి తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదులు స్వీకరించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసు అధికారి అజయ్ సింగ్ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman allegedly attacked her husband with a sickle after he took her phone to see her WhatsApp chat and call records. Netrapal Singh (23), was taken to SN Medical College and was given multiple stiches on his head.
Please Wait while comments are loading...