ఎమ్మెల్యే నీచుడు: ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ప్రభుత్వ మాజీ లేడీ టీచర్, కొన్ని నిమిషాల్లో!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: ఆమె ఓ మాజీ ప్రభుత్వ ఉపాద్యాయురాలు, స్థానిక ఎమ్మెల్యే లైంగిక కోర్కెతీర్చలేనని ఆరోపిస్తూ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వేధింపులు ఎక్కవ అయ్యాయని ఫేస్ బుక్ లో ఆరోపిస్తూ కొన్ని నిమిషాల్లో అధిక మోతాదులో నిద్రమాత్రలు సేవించి నా చావుకు నీచుడు ఎమ్మెల్యేనే కారణం అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేసి ఆత్మహత్యాయత్నం చేసింది.

నా చావుకు ఎమ్మెల్యే కారణం

నా చావుకు ఎమ్మెల్యే కారణం

నా చావుకి నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి కారణం, తన గోడును కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బెంగళూరు గ్రామీణ జిల్లా నెలమంగలలో లేఖ రాసిన శివకుమారి (30) అనే మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.

Big News Big Bite : Today Trending News
ఎమ్మెల్యే నీచుడు

ఎమ్మెల్యే నీచుడు

మహిళపై అత్యాచారం జరగాలి, లేదా హత్య జరగాలి. అప్పుడే కర్ణాటక ప్రభుత్వం న్యాయం చేస్తుందా అంటూ శివకుమారి ఫేస్ బుక్ లో పోస్టుచేసి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన నీచుడు నెలమంగల ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి, నా చావుకి అతడే కారణం అంటూ ఫేస్ బుక్ లో పోస్టుపెట్టిన కొన్ని నిమిషాలకే శివకుమారి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగం

ప్రభుత్వ ఉద్యోగం

గతంలోనూ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి తనను వేధిస్తున్నాడని, అతడికి లొంగలేదనే కసితో రౌడీలతో బెదిరించి తాను ప్రభుత్వ టీచర్ ఉద్యోగంలో కొనసాగడానికి వీలులేకుండా చేశాడని శివకుమారి ఆరోపించారు. కొద్దినెలల క్రితం శివకుమారి, ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి వ్యవహారం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. .

సోషల్ మీడియాలో ప్రచారం !

సోషల్ మీడియాలో ప్రచారం !

ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అవినీతికి పాల్పడుతున్నారని, మహిళలను లైంగిక వేధిస్తున్నాడని ఆరోపిస్తూ శివకుమారి సోషల్ మీడియాలో ముమ్మరంగా ప్రచారం చేసి సంచలనం సృష్టించింది. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగానికి రాజీనామా చేసిన శివకుమారి ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తిపై 2018లో జరిగే శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు..

షాక్ ఇచ్చిన శివకుమారి

షాక్ ఇచ్చిన శివకుమారి

జనజాగృతి అభియాన్‌ పేరుతో శివకుమారి నెలమంగల తాలూకాలో పర్యటిస్తూ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తికి వ్యతిరేకంగా పోరాటం చేసుకున్నారు. ఆదివారం ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి మీద ఫేస్‌బుక్‌ లో పోస్టులు పెట్టిన శివకుమారి వెంటనే ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. నెలమంగల పోలీసులు ఈ వ్యవహారం గురించి విచారణ చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Woman attempt suicide post facebook against MLA near Bengaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి