ఎమ్మెల్యే రేప్: సీఎం నివాసం ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట ఆదివారం నాడు ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపుతోంది. యువతి కుటుంబసభ్యులు కూడ ఆ యువతికి మద్దతుగా నిలిచారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ బిజెపి ఎమ్మెల్యే ఆయన అనుచరులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు.ఈ విషయమై తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె చెబుతున్నారు.

Woman attempts to commit suicide outside UP CM Yogi Adityanaths residence, alleges rape by BJP MLA

తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత మహిళ తన కుటుంబంతో కలిసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. యువతికి మద్దతుగా ఆమె కుటుంబసభ్యులు కూడ సీఎం నివాసం ముందే పడుకొని నిరసనకు దిగారు.

ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే తమను బెదిరించారని బాధితురాలు చెబుతున్నారు. సీఎం వద్దకు వెళ్ళి మొర పెట్టుకొన్నా ఫలితం లేకుండా పోయిందని బాధితురాలు ప్రకటించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ఎదుట సూసైడ్‌కు ప్రయత్నించారు.అయితే పోలీసులు ఆ యువతి ప్రయత్నాన్ని అడ్డుకొన్నారు.ఆ యువతితో పాటు ఆమె కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+