తండ్రిని అవమానించిన బీజేపీ నేత: బాధితుడి కూతురి ఆత్మహత్యాయత్నం

భోపాల్: తన తండ్రిని ఓ పార్టీ నాయకుడు అవమానించిన వీడియో వైరల్‌గా మారడంతో.. మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్‌లో చోటు చేసుకుంది.

జబల్పూర్ బీజేపీ మైనారిటీ సెల్ విభాగం అధ్యక్షుడు మహ్మద్ షఫిక్.. ఇటీవల ఓ వ్యక్తితో డబ్బు విషయమై గొడవ పెట్టుకుని అతడ్ని అవమానాలకు గురిచేశాడు. అతడిని మోకాళ్లపై కూర్చోబెట్టి దండం పెట్టించుకున్నాడు.. అంతేగాక, అతడి వీపుపై వాటర్ బాలిల్ పెట్టి.. వీడియో తీశాడు.

Woman attempts suicide after BJP leader humiliates father, circulates video

ఈ వీడియో సదరు నాయకుడు వాట్సప్‌లో అది వైరల్‌గా మారింది. అవమానానికి గురైన ఆ వ్యక్తి కూతురు చదువుకునే కాలేజీలోని ఆమె స్నేహితుల ఫోన్లలోనూ ఈ వీడియో కనబడింది. దీంతో తీవ్ర అవమానంగా భావించిన సదరు యువతి.. ఇంటికెళ్లి పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.

కాగా, తన భర్తపై దాడిచేసిన, తన కూతురు ఆత్మహత్యయత్నానికి కారణమైన సదరు నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య డిమాండ్ చేసింది. సదరు బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేశారు. కాగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బీజేపీలో ఇలాంటి వారికి స్థానం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాహుల్ కొఠారి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+