కొడుకు ప్రేమ: మహిళను కొట్టి నగ్నంగా ఊరేగించారు

ఈ సంఘటనను స్థానికులు చూస్తూ ఉండిపోయారు. హోలీకు ముందు రోజు ఆదివారంనాడు ఆ సంఘటన చోటు చేసుకుంది. మహిళ పరిస్థితి దయనీయంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం ఆ మహిళ కుమారుడు మనోజ్ గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన అమ్మాయితో పారిపోయి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
అప్పటి నుంచి ఆ మహిళను వేధిస్తూనే ఉన్నారు స్థానిక పాఠశాలలో ఆమె మధ్యాహ్నం భోజనం వంట మనిషిగా పనిచేస్తోంది. పెళ్లి జరిగి ఏళ్లు గడిచినా ఆమె పట్ల అమ్మాయి కుటుంబం కక్షపూరితంగానే వ్యవహరిస్తూ వచ్ిచంది.
కొద్ది నెలల క్రితం మనోజ్ గ్రామానికి వచ్చి, అమ్మాయిని వారి కుటుంబ సభ్యుల వద్ద దించాడు. కుటుంబ సభ్యులను కలుస్తుందనే ఉద్దేశంతో ఆ పనిచేశాడు. అమ్మాయిని బలవంతంగా వారు తమ బంధువుల ఇంటికి పంపించారు. అక్కడి నుంచి ఆమెను మనోజ్ అపహరించుకుపోయాడని వారు అనుమానిస్తూ వచ్చారు.












Click it and Unblock the Notifications