దారుణం: మరో కులం అబ్బాయిని ప్రేమించిందని చెట్టుకు కట్టేసి కొట్టారు

మరో కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి అతనితో వెళ్లిపోయినందుకు ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే అమ్మాయికి విధించిన శిక్షను సమర్థించారు ఆమె తల్లిదండ్రులు. యువతిని చితకబాదుతుండగా వారు అక్కడే నిల్చొని చూస్తూ ఉండిపోయారు. ఈ దృశ్యాన్ని కొందరు స్థానికులు వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఘటన వెలుగు చూసింది.

నవాడా జిల్లా రాజౌలి గ్రామానికి చెందిన యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే అతను వేరే కులానికి చెందినవాడు. తను ప్రేమించిన వ్యక్తితో సెప్టెంబర్ 30న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దగ్గరలోని మరో గ్రామంలో వారు నివాసమున్నారు. అది గమనించిన యువతి గ్రామస్తులు ఆ పక్క గ్రామానికి వెళ్లి ఆమెను రాజౌలికి ఈడ్చుకొచ్చారు. పంచాయతీ పెట్టారు. దీంతో పంచాయతీ పెద్దలు వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమించి పారిపోయినందుకు యువతిని చెట్టుకు కట్టేశారు.

Woman in Bihar tied to a tree and thrashed for eloping

యువతిని చితకబాదుతుండగా కొందరు స్థానికులు వీడియో తీశారు. యువతిని బాగా చితకబాదడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అక్కడే ఉన్న తల్లిదండ్రులు యువతిని ఇంా కొట్టాల్సిందిగా పంచాయతీ సభ్యులను ప్రోత్సహించారు. స్పృహ నుంచి కోలుకోగానే మళ్లీ చితకబాదారు. అబ్బాయి గురించి వివరాలు అడుగగా... యువతి చెప్పేందుకు నిరాకరించింది. దీంతో వారు ఆగ్రహంతో ఊగిపోయి మరింత దాడి చేశారు. అయితే తాను ఇష్టపడే తను ప్రేమించిన అబ్బాయితే వెళ్లిపోయినట్లు యువతి మీడియాతో చెప్పింది. ఇదిలా ఉంటే చేసిన తప్పుకు యువతి శిక్ష అనుభవించడం సరైనదే అని తండ్రి చెప్పాడు. తమ కులానికి చెందిన వ్యక్తితోనే యువతికి పెళ్లి చేయాలని తాము భావించామని... కానీ మరో కులానికి చెందిన వ్యక్తితో పారిపోయి తమ పరువు తీసిందని యువతి తండ్రి ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+