వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ము..ము..ముద్దంటే చేదా: ముద్దు పెడతానంది..సగం నాలుకను కొరికేసింది..ఎందుకో తెలుసా?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ము..ము..ముద్దంటే చేదా... నీకా ఉద్దేశం లేదా... అనే సినీ పాట వినేఉంటాం. ఇక్కడ కూడా ఓ మహిళకు ముద్దంటే చేదో లేక తన భర్త అంటే చేదో తెలియదుగానీ...తన భర్తకు ముద్దు పెట్టేందుకు వచ్చి ఏకంగా ఆయన నాలుకనే కొరికి పడేసింది. ఇదేమి నాటు సరసమో అర్థంకాలేదు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఒక్కసారిగా వార్త బయటకు పొక్కడంతో తెగ వైరల్ అయ్యింది.

ఢిల్లీలోని రన్హోలాలో శనివారం రాత్రి 22 ఏళ్ల గర్భిణి తన భర్త నాలుకను కొరికిన విషయం బయటకు పొక్కడంతో ఆ అంశం ఆ వీధిలో చర్చనీయాంశమైంది. మహిళకు తన భర్త ముందునుంచే నచ్చేవాడు కాదని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు దంపతులిద్దరూ తరుచూ గొడవపడేవారని స్థానికులు చెబుతున్నారు. భర్త రోడ్లపై బొమ్మలు వేసుకుంటూ డబ్బులు సంపాదించడం భార్యకు నచ్చలేదు. ఇదే వారిమధ్య గొడవకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గత కొన్నిరోజులుగా మాటలు లేవని తెలుస్తోంది.

Woman bites husband tongue while kissing,but not out of love

ఆ తర్వాత కొన్ని రోజులకు భార్య భర్త దగ్గరకు ప్రేమతో వచ్చినట్లు నటించి ముద్దు ఇస్తూ ఒక్కసారిగా తనకోపాన్నంతా భర్త నాలుకపై ప్రదర్శించింది. ఒక్కసారిగా భర్త నాలుకను కొరికేసింది. ఏకంగా సగం నాలుకను కొరికేసింది.ఆడవారి మాటలకు అర్థాలేవేరులే అని గ్రహించుకోలేకపోయాడు భర్త. పాపం భర్త పరిస్థితిని ఆయన తల్లిదండ్రులు చూడలేకపోయి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధిత భర్తను చికిత్స కోసం సఫ్దార్‌జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే సగం నాలుక కోల్పోయిన భర్త తిరిగి మాట్లాడుతారన్న గ్యారెంటీ వైద్యులు ఇవ్వలేకున్నారని పోలీసులు తెలిపారు. మహిళ 8నెలల గర్భంతో ఉందని ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఇదిలా ఉంటే 2016 నవంబర్ 20న వారిద్దిరికి వివాహం జరిగింది.

English summary
A 22-year-old man lost almost half of his tongue after his pregnant wife deliberately bit it off while kissing him, the police said Sunday.The incident was reported from outer Delhi's Ranhola on Saturday night.Locals said that the woman was not happy as she felt her husband was not good-looking.However, the couple had compatibility issues and had regular fights, the police said, adding the husband is a street artiste.He had an altercation with his 22-year-old pregnant wife and they later patched up. And the next time she kissed him she bit almost half of his tongue off, they added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X