పుట్టింటికి వెళ్లిన భార్య కోసం భర్త వెళితే నరికి చంపారు
లక్నో: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు వెళ్లిన భర్తను ఆమె సోదరులు అత్యంత దారుణంగా హతమార్చిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుధాన ప్రాంతంలో చోటు చేసుకుంది. సోదరులతో కలిసి కట్టుకున్న భర్తను హతమార్చిన ఈ సంఘటన బుధాన్‌లో కలకలం సృష్టించింది.
పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. రాజీవ్ (26), సర్వేష్ దంపతులు. వీరిద్దరి మధ్య మనస్ఫర్దలు వచ్చాయి. దీంతో సర్వేష్ బుధాన ప్రాంతంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో గత రెండు నెలలుగా తల్లిదండ్రుల దగ్గర ఉన్న తన భార్యను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు రాజవీ అక్కడికి వెళ్లాడు.

అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ సర్వేష్‌తో పాటు ఆమె సోదరులు సత్పాల్, విక్రమ్‌లతో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం సమీపంలోని హిందున్ నదిలో పడేశారు. అయితే కోడలిని ఇంటికి తీసుకొస్తానని భార్య వద్దకు వెళ్లిన తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో రాజవీ తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజీవ్ భార్య సర్వేష్‌ను అదుపులోకి విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. నదిలోని రాజీవ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. భర్త హత్య కేసులో ఇద్దరు సోదరులు పాటు, సర్వేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications