సీనియర్ నేతకు మద్యం తీసుకొస్తూ బుక్కైన మహిళా నేత
మద్య నిషేధం కొనసాగుతున్న బీహార్ లో ఓ సీనియర్ నేతకు మద్యం తీసుకొస్తున్న మహిళా నేతను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
బీహార్: మద్య నిషేధం కొనసాగుతున్న బీహార్ లో ఓ సీనియర్ నేతకు మద్యం తీసుకొస్తున్న మహిళా నేతను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమె నుంచి మొత్తం 16 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(ఐఎంఎఫ్ఎల్) బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆమెకు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీకి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్జేడీ పంచాయతీ విభాగానికి ఉపాధ్యక్షురాలిగా పని చేస్తున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. గురువారం రాత్రి మాదెపురా జిల్లాలోని సరిహద్దు ప్రాంతం వద్ద ఔట్ పోస్టును ఏర్పాటు చేసి తనఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రేణుయాదవ్ వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీలు చేశారు.

అందులో 16 మద్యం బాటిళ్లు లభ్యం కావడం, ఆమె ఆర్జేడీకి చెందిన నేతగా చెప్పడంతో పోలీసులు ఖిన్నులయ్యారు. ఆ తరువాత అరెస్టు చేశారు. ఆ మద్యాన్ని పశ్చిమ బెంగాల్ లోని దాఖోలా అనే ప్రాంతం నుంచి మాదెపురాలోని ఓ సీనియర్ పార్టీ నేతకు తీసుకెళుతున్నట్లుగా గుర్తించామని పోలీసులు చెప్పారు.
అయితే, ఆ సీనియర్ పార్టీ నేత ఎవరనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. ఇదిలా ఉండగా ఆమెకు తమ పార్టీకి సంబంధమే లేదని ఆర్జేడీ తెలిపింది. పలు అవినీతి కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆ మహిళా నేతను తాము గతంలోనే పార్టీ నుంచి తొలగించామని, ప్రస్తుతం ఆమె సీపీఐ(ఎంఎల్)లో పనిచేస్తుందని ప్రకటించింది.












Click it and Unblock the Notifications