
వీడియో: స్టేజీ మీద, అందరూ చూస్తోండగా ఎడం కాలి చెప్పుతో చితగ్గొట్టింది..!!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధ వాకర్ హత్యోదంతంలో కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను ఢిల్లీ పోలీసులు పాలిగ్రఫీ పరీక్షలను నిర్వహించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పాలిగ్రఫీ పరీక్షలను చేపట్టారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఇంకా అందాల్సి ఉంది. దేశం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ కేసులో తీగ లాగుతున్న కొద్దీ డొంక కదులుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
తన ప్రియురాలు శ్రద్ధ వాకర్‌ను హత్య చేసిన నిందితుడు ఆఫ్తాబ్.. ఆమె శరీరాన్ని 35 భాగాలుగా కత్తిరించి వేర్వేరు ప్రాంతాల్లో విసిరేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. విచారణను ఎదుర్కొంటోన్నాడు. శ్రద్ధను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అతని నుంచి మరిన్ని వివరాలను రాబట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు. ఇందులో భాగంగా పాలిగ్రఫీ పరీక్షలను నిర్వహించారు.

పాలిగ్రఫీ పరీక్ష కోసం ఆఫ్తాబ్‌ను తీసుకెళ్తోన్న పోలీస్ వాహనంపై కొందరు దుండగులు దాడి చేశారు. కత్తులతో బెదిరించారు. ఢిల్లీ రోహిణీ ప్రాంతంలో ఉన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తీసుకెళ్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఇద్దరినీ కుల్‌దీప్ సింగ్, నిగమ్‌గా గుర్తించారు. వారిద్దరూ హిందూ సేన సంస్థకు చెందిన కార్యకర్తలుగా పోలీసులు విచారణలో తేలింది.

శ్రద్ధ హత్యోదంతానికి నిరసనగా హిందూ ఏక్తా మంచ్ ఇవ్వాళ ఢిల్లీ ఛతర్‌పూర్ ప్రాంతంలో మహా పంచాయత్‌ను ఏర్పాటు చేసింది. బేటీ బచావో పేరుతో దీన్ని ఏర్పాటు చేసింది. ఛతర్‌పూర్ 100 అడుగుల రోడ్డులో నిర్వహించిన ఈ సభకు పెద్ద ఎత్తున హిందూ ఏక్తా మంచ్ ప్రతినిధులు, స్థానికులు హాజరయ్యారు. శ్రద్ధ వాకర్‌కు నివాళి అర్పించారు. ఏక్తా మంచ్ ప్రతినిధులు ప్రసంగించారు. పోలీసుల దర్యాప్తును మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అదే సమయంలో- సభకు హాజరైన వారిలో నుంచి ఓ మహిళ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. ఏక్తా మంచ్ ప్రతినిధులు ఆమెకు అవకాశం ఇచ్చారు. మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఆమె- తనకు ఆనుకుని నిల్చున్న వ్యక్తిని చెప్పుతో కొట్టారు. తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసి, ఎడం కాలి చెప్పు తీసి స్టేజీ మీదే, అందరూ చూస్తుండగానే కొట్టారు. స్టేజీ మీద ఉన్న వారు ఆమెను వారించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఎందుకు ఆ వ్యక్తిపై దాడి చేశారనేది తెలియరాలేదు.
కాంగ్రెస్
సభలో
దూసుకొచ్చిన
ఎద్దు
-
బీజేపీ
కుట్రేనట..!!