Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'హ్యాపీ న్యూ ఇయర్' చూపించలేదని యాసిడ్ తాగిన స్త్రీ

ముంబై: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ నటించిన హ్యాపీ న్యూ ఇయర్ సినిమా చూపించలేదని తన భర్తపై ఆగ్రహించిన 21 ఏళ్ల వివాహిత యాసిడ్ తాగింది. ఆ సినిమా చూపించడానికి భర్త నిరాకరించడంతో ఆమె తీవ్రమైన ఆసంతృప్తికి గురైనట్లు చెబుతున్నారు.

ఆ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర భోపాల్‌లోని ఖానియా దానాలో చోటు చేసుకుంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. యాసిడ్ ధాటికి ఆమె దేహంలోని అవయవయాలు కాలిపోయినట్లు చెబుతున్నారు.

Woman consumes acid after husband refuses to take her to watch 'Happy New Year'

వివరాలు ఇలా ఉన్నాయి - దీపావళి సందర్భంగా విడుదలైన హ్యాపీ న్యూ ఇయర్ సినిమాను సమీపంలోని థియేటర్‌లో చూపించాలని నేహా సేన్ తన భర్త విశాల్‌ను అడిగింది. అయితే, చాలా రద్దీ ఉందని ఆమెను తీసుకుని వెళ్లడానికి నిరాకరించాడు. దాంతో ఆమె యాసిడ్ తాగింది.

యాసిడ్ తాగిన ఆమెను సమీపంలోని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత గ్వాలియర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసును పరిశీలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+