సూపర్‌మార్కెట్లో దొంగతనం చేస్తూ దొరికిన మహిళా పోలీస్!: భర్తతో కలిసి వీరంగం(వీడియో)

Recommended Video

    సూపర్‌మార్కెట్లో దొంగతనం చేస్తూ దొరికిన మహిళా పోలీస్!

    చెన్నై: ఎవరైనా దొంగతనం చేస్తే వారిని పట్టుకోవాల్సిన ఓ మహిళా పోలీసే దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది. అంతేగాక, చోరీ చేస్తుంటే ప్రశ్నించినందుకు.. తననే నిలదీస్తావా? అంటూ భర్తతో కొట్టించింది. ఈ ఘటన చెన్నైలోని చెట్‌పేట్‌లో బుధవారం చోటు చేసుకుంది.

    ఆ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సూపర్‌ మార్కెట్‌లో సదరు మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ వస్తువులను జేబులో పెట్టడాన్ని అక్కడే పనిచేస్తున్న ప్రణవ్‌ గమనించాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి చోరీ చేసిన వస్తువులను తిరిగి ఇవ్వాలని కోరాడు. అంతేగాక, తప్పు చేసినట్టు క్షమాపణ పత్రం రాసి ఇవ్వాలని కోరాడు.

    Woman cop suspended for stealing from supermarket

    దీంతో ఆ మహిళా పోలీసు ఆగ్రహానికి గురైంది. సదరు మహిళా పోలీసు తన భర్తకు విషయం చెప్పడంతో అతను మరికొందరిని తన వెంట వేసుకొని సూపర్‌ మార్కెట్‌పై దాడి చేశాడు. ప్రణవ్‌ను ఇష్టానుసారంగా కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

    ఈ వ్యవహారంతో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన సదరు మహిళా పోలీసులు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దర్యాప్తు అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

    కాగా, ఆ మహిళా పోలీసు, ఆమె భర్త సూపర్ మార్కెట్‌లో చేసిన వీరంగమంతా కూడా అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. దీంతో సదరు పోలీసుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+