చుట్టూ 12 సింహలు... అంబులెన్స్ లోనే మహిళ ప్రసవం
అర్ధరాత్రి పూట ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు తరలిస్తుండగా రోడ్డుపైకి 12 సింహలు గుంపుగా వచ్చాయి.
అమ్రేలీ: అర్ధరాత్రి పూట ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ మహిళను సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు తరలిస్తుండగా రోడ్డుపైకి 12 సింహలు గుంపుగా వచ్చాయి. అయితే రోడ్డుపైనే సింహాలు ఉండడంతో అంబులెన్స్ లో ఆ మహిళకు ప్రసవం చేశారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
గుజరాత్ రాష్ట్రంలోని ఆమ్రేలీ జిల్లాలో గురువారం రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఆ క్షణాలను ఆ తల్లి మంగూబెన్ మక్వానా తన జీవితంలో మర్చిపోలేదు. లూనాసాపూర్ గ్రామానికి చెందిన ఆమెకు గురువారం రాత్రి పురిటినొప్పులు వచ్చాయి.

హుటహుటిని ఆమెను 108 అంబులెన్స్ లో జపారాబాద్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యలోని గిర్ అటవీ ప్రాంతానికి సమీపాన వాహనంలోనే మక్వానాకు నొప్పులు ఎక్కువయ్యాయి.
అత్యవసర పరిస్థితిని గుర్తించిన పారా మెడికల్ సిబ్బంది ఆశోక్, డ్రైవర్ రాజుకు వాహనాన్ని ఆపాలని సూచించారు. వెంటనే డాక్టర్ తో ఫోన్ లో సంప్రదింపులు ప్రారంభించారు. ఇంతలో ఒక్కసారిగా పొదల్లో నుండి 3 మగ సింహలు సహ 12 సింహలు వచ్చి వాహనాన్ని చుట్టుముట్టాయి.
అయితే సింహలను పక్కకు అదిలించేందుకు ప్రయత్నించినా అవి కదల్లేదు. మరో వైపు వాహనం లోపల ఉణ్న ఆశోక్ నిశ్శబ్ద వాతావరణంలోనే డాక్టర్ సలహాలు తీసుకొంటూనే ప్రసవం చేశాడు. అనంతరం వాహనం లైట్లు వేస్తూ ఆర్పుతూ నెమ్మదిగా సిహలను అదిలిస్తూ రాజు అంబులెన్స్ ను పోనిచ్చాడు.
ఎట్టకేలకు తల్లీ బిడ్డలను జఫారాబాద్ ఆసుపత్రికి తరలించారు. సాహసోపేతంగా అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరును 108 అధికారి చేతన్ గాధే అభినందించారు.












Click it and Unblock the Notifications