రైల్లో మహిళ ప్రసవం: టాయిలెట్లోంచి జారి ట్రాక్‌పై పడి బతికిన శిశువు

జైపూర్: వేగంగా కదులుతున్న రైలు టాయిలెట్‌లోనే ఓ మహిళ ప్రసవించింది. అయితే అప్పుడే పుట్టిన శిశివు టాయిలెట్ పైపు నుంచి జారి ట్రాక్ మధ్యలో పడిపోయింది. కదులుతున్న రైలు టాయిలెట్ నుంచి జారి పడిన శిశువు ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ నుంచి హనుమాన్‌గఢ్‌కు వెళ్తున్న స్టేషనరీ రైలులో చోటు చేసుకుంది.

22 ఏళ్ల వయస్సు గల మన్ను అనే గర్భవతి తన భర్త, తల్లితో కలిసి రైలులో ప్రయాణిస్తున్నది. మార్గమధ్యంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమె టాయిలెట్ కెళ్లి అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే సృహకోల్పోవడంతో అప్పుడే పుట్టిన శిశువు టాయిలెట్ ద్వారం నుంచి ట్రాక్ మధ్యలో పడిపోయింది.

Woman delivers in train toilet; baby falls on tracks, survives

కొద్ది సేపటికి తర్వాత మన్ను సృహకోల్పోవడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. అప్పటికే ట్రైన్ హనుమాన్‌గఢ్‌కు 13 కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. హనుమాన్‌గఢ్ జంక్షన్‌లో ఈ విషయాన్ని రైల్వే పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.

ఇదిలా ఉండగా ట్రాక్ మధ్యలో పడి ఏడుస్తున్న శిశువును స్థానికుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. తల్లీబిడ్డలు క్షేమమేనని వైద్యులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+