శృంగారం కోసం భార్య డిమాండ్..ఇరగదీసిన భర్త, స్టోరీలో ట్విస్ట్ ఏంటి?
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాదు పోలీస్‌స్టేషన్‌లో ఓ వింత కేసు నమోదైంది. భర్తను శృంగారంలో పాల్గొనాల్సిందిగా భార్య పట్టుబట్టడంతో ఆ భర్త ఆమెను చితకబాదాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ.

శృంగారం విషయంలో భార్యా భర్తల మధ్య గొడవ
అహ్మదాబాదులోని దనిలిమ్దా నివాసి అయిన 22 ఏళ్ల మహిళతో సర్కేజీ ప్రాంత నివాసి అయిన ఓ వ్యక్తితో 2016లో వివాహమైంది. మొదట్లో భార్యా భర్తలు ఇద్దరూ చాలా అన్యూన్యంగా ఉన్నారు. వారికి 2018లో తొలి సంతానం కలిగింది. ఇక బిడ్డ పుట్టాక భర్తలో మార్పు వచ్చిందంటూ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. గత కొన్ని నెలలుగా భర్త తనతో శృంగారంలో పాల్గొనడం లేదని భార్య ఫిర్యాదులో పేర్కొంది. ఇదే విషయమై వారిమధ్య పలుమార్లు వాగ్వాదం కూడా జరిగినట్లు చెప్పింది.

శృంగారంకు పట్టుబట్టిన భార్య..చితకబాదిన భర్త
కొన్ని రోజుల తర్వాత ఇదే విషయంలో దంపతులు ఇద్దరూ గొడవ పడ్డారు. శృంగారంలో పాల్గొనాల్సిందేనంటూ భార్య పట్టుబట్టినట్లు చెప్పింది. భర్తకు కోపం నశాలానికి అంటిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇక కోపోద్రిక్తుడైన భర్త సహనం కోల్పోయి ఆమెను అనరాని మాటలు అంటూ, దూషణలకు దిగి తనను చితకబాదినట్లు మహిళ చెప్పింది. సెక్స్ అనే పదం ఉచ్చరించినప్పుడల్లా ఆయన తనను కొడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు తాను బ్రహ్మచర్యం తీసుకుంటున్నట్లు చెబుతున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మహిల పేర్కొంది.

వేధింపులకు గురిచేసిన అత్తమామలు
ఇక శృంగారం కోసం తన కోడలు గట్టిగా డిమాండ్ చేస్తుండటంతో కొడుకు ఇళ్లును విడిచి వెళ్లిపోయాడని మహిళ అత్తమామలు చెబుతున్నారు. కానీ తనపై అత్తమామలు కూడా చేయిచేసుకున్నారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు పెళ్లి జరిగి తను అత్తగారి ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి అత్తమామలు తనను ఏదోరకంగా వేధించేవారిని ఫిర్యాదు చేసింది మహిళ. కొన్ని సందర్భాల్లో కొట్టేవారిని కంప్లయింట్ ఇచ్చింది. అయితే కొందరి దగ్గర తన భర్త అప్పుచేశాడని ఆ ఒత్తిడి తనపై ఉందని మహిళ చెప్పింది. ఈ క్రమంలోనే బిడ్డను కూడా పట్టించుకోవడం మానేశాడని ఆమె వెల్లడించింది.

గృహహింస చట్టం కింద కేసు నమోదు
బిడ్డ ఆరోగ్యం బాగోలేకపోతే ఒక్క పైసా కూడా చికిత్స కోసం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. అత్తమామలు కూడా డబ్బులు ఇవ్వలేదని.. చికిత్స కోసం డబ్బులు ఇవ్వకపోగా ఆమెను చితకబాదినట్లు ఫిర్యాదులో పేర్కొంది. భర్త అత్తమామలపై పోలీసులు గృహహింస కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేసులో ఎవరినీ అరెస్టు చేయాలేదని స్టేషన్ హౌజ్ ఆఫీసర్ చెప్పారు. మొత్తానికి గుట్టుగా ఉండాల్సిన వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు రావడానికి తన భర్త అత్తమామలే కారణం అని మహిళ ఆరోపించింది.












Click it and Unblock the Notifications