వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తని వదిలి ఫేస్‌బుక్ ప్రియుడి కోసం లేచిపోయింది

|
Google Oneindia TeluguNews

నాసిక్: ప్రేమకు 'హద్దు'లు ఉండవు! కానీ ఓ ప్రేమికురాలు మాత్రం తన ఫేస్‍‌బుక్ స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు ఏకంగా తన భర్తనే వదిలేసి వెళ్లిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో చోటు చేసుకుంది.

ఓ యువతికి మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఆమెకు నాసిక్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహం జరిగింది. ఫేస్‌బుక్ ద్వారా ఆమెకు ఇటీవల ఉత్తరాఖండులోని లోహఘాట్‌కు చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతను ఢిల్లీలోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు.

Woman ditches husband, elopes with Facebook friend

ఈ పరిచయం వారి మధ్య ప్రేమకు దారి తీసింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో గత నెల పదవ తేదీన సదరు వివాహిత తన భర్తను వదిలేసి ప్రియుడు వద్దకు వెళ్లిపోయింది.

ఇంట్లోని నగదు, డబ్బులు కూడా ఎత్తుకెళ్లింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమెను గుర్తించి వెనక్కి తీసుకు వచ్చారు. మరోవైపు విషయం తెలిసిన ప్రియుడు పరారయ్యాడు.

ప్రేమకు 'హద్దు'లు ఉండవు! కానీ ఓ ప్రేమికురాలు మాత్రం తన ఫేస్‍‌బుక్ స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు ఏకంగా తన భర్తనే వదిలేసి వెళ్లిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో చోటు చేసుకుంది.

English summary
Reportedly, the woman got married to a businessman in Nasik three years back. Recently, she fell in love with a Lohaghat man, who works at a hotel in Delhi. The woman met him through social networking site Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X