టచింగ్ స్టోరీ: 'భార్యను స్నేహితుడికిచ్చి పెళ్లి చేసిన భర్త'

చైనా : ప్రపంచంలో ఏ భర్తయినా తన భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు సిద్దపడుతాడా..! కానీ ఓ చైనా భర్త ఆ పని చేశాడు. అయితే ఇందులో సిగ్గుచేటు వ్యవహారమేమి లేదు. భార్య కోసం భర్త చేసిన త్యాగం తప్ప..

వినడానికి ఇదో విచిత్రమైన సంఘటన.. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇందులో ఓ భర్త త్యాగం, ఓ భార్య సేవా నిరతి, ఓ మిత్రుడి గొప్ప మనసు కనపడుతాయి. భార్య సుఖ సంతోషాల కోసం భర్త త్యాగానికి సిద్దపడితే.. ముందుకొచ్చిన ఓ మిత్రుడు ఆమెను వివాహామాడి, తిరిగి ఆమెతో కలిసి తన మిత్రుడికి సేవలందిస్తున్నాడు.

చైనాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడక్కడి సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్. ఇక అసలు విషయానికొస్తే.. జియాంగ్, జుపింగ్ అనే దంపతులకు 1996 లో వివాహామైంది. నాలుగేళ్ల పాటు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోయిన వీళ్ల కాపురాన్ని 2002లో ఓ యాక్సిడెంట్ కబలించింది. యాక్సిడెంట్ లో భర్త జియాంగ్ తీవ్ర గాయాలపాలై మంచానికే అతుక్కుపోయే పరిస్థితి వచ్చింది.

Woman divorces paralyzed husband, Marries his best frien so they can take care of him together

దీంతో లేవలేని స్థితిలో ఉన్న భర్త జియాంగ్ కు భార్య జుపింగ్ సేవలు చేస్తూ వస్తోంది. అయితే ఇంకెంతో భవిష్యత్తు ఉన్న తన భార్య, తనవల్ల సుఖ-సంతోషాలకు దూరం కావద్దని భావించిన భర్త జియాంగ్, తన భార్యను మరో వివాహాం చేసుకోవాల్సిందిగా కోరాడు.

అయితే భర్త ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం తెలిపిన భార్య జుపింగ్.. చివరకు భర్త జియాంగ్ తీవ్ర ఒత్తిడి మేరకు 2009లో అతనికి విడాకులిచ్చి మరో వ్యక్తిని వివాహామాడింది. అయితే ఆ వివాహామాడిన వ్యక్తి కూడా జియాంగ్ కు చాలా సన్నిహితుడు కావడం గమనార్హం.

కాగా, జుపింగ్ ని పెళ్లిని చేసుకున్న లియూ జాంగ్ కూడా తన మిత్రుడు జియాంగ్ బాగోగులు చూసుకోవడానికి శ్రద్ద చూపడంతో.. జుపింగ్, లియూ జాంగ్ ఇద్దరూ కలిసి ఇప్పుడు జియాంగ్ కి సేవలు అందిస్తూ ఒకే ఇంట్లో ఆనందంగా ఉంటున్నారు. జాంగ్ తో పెళ్లయ్యాక 2012లో జుపింగ్ ఓ బాబుకి జన్మనిచ్చినా.. ఇద్దరు కలిసి వేరు కాపురం పెట్టాలనే ఆలోచన చేయకుండా.. జియాంగ్ కి నిస్వార్థంగా సేవలందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+