చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చేజింగ్, ఓలా డ్రైవర్: లేడీ డాక్టర్ పై అత్యాచార యత్నం

|
Google Oneindia TeluguNews

చెన్నై: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓలా క్యాబ్ డ్రైవర్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి మహిళా డాక్టర్ పై అత్యాచార యత్నం చేసిన ఘటన చెన్నై నగరంలో జరిగింది. ఓలా క్యాబ్ వెనుక వెలుతున్న ఓ వ్యక్తి మహిళా డాక్టర్ కేకలు విని చేజ్ చేసి స్థానికుల సహాయంతో ఆమెను రక్షించాడు.

మహిళా డాక్టర్ పై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. దక్షిణ చెన్నైలోని ఇంజంబక్కమ్ ప్రాంతంలో ఓ మహిళా డాక్టర్ నివాసం ఉంటున్నారు. ఈమె ఉత్తర చెన్నైలోని అంబట్టూరులోని ప్రయివేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నారు.

గత ఆదివారం రాత్రి నైట్ షిఫ్ట్ కు వెళ్లడానికి ఓలా క్యాబ్ మాట్లాడుకుంది. మరుదు అనే డ్రైవర్ లేడీ డాక్టర్ ఇంటి దగ్గరకు క్యాబ్ తీసుకు వెళ్లాడు. ఆమె కారులో కుర్చున్న తరువాత మరుదు కారు వేగంగా నడిపాడు.

Woman doctor narrowly escapes sexual assauilt by Ola driver in Chennai

ఆదివారం రాత్రి ట్రాఫిక్ చాల తక్కువగా ఉండటంతో వేగంగా వెళ్లి మార్గం మధ్యలో కారునిలిపాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు వెనుకసీట్లోకి ఎక్కి డాక్టర్ కు ఇటు అటు కుర్చున్నారు. ఎవరు వీరు అని మహిళా డాక్టర్ క్యాబ్ డ్రైవర్ మరుదును ప్రశ్నించారు.

వారిద్దరూ నాస్నేహితులని, మార్గం మధ్యలో దిగిపోతారని డ్రైవర్ చెప్పాడు. వెనుక కుర్చున్న ఇద్దరూ మహిళా డాక్టర్ ను లైంగికంగా వేధించారు. అప్పటికే ఆమె తన స్నేహితులకు మెసేజ్ చేశారు. కారు నిలపాలని డ్రైవర్ కు చెప్పారు.

అయితే మరుదు ఆమె మాటలు పట్టించుకోకుండా కారువేగంగా నడిపాడు. మహిళా డాక్టర్ గట్టిగా కేకలు వేయడంతో వెనుక వాహనంలో వెలుతున్న వ్యక్తి విషయం గుర్తించి ఓలా క్యాబ్ ను చేజ్ చేశాడు.

తరువాత స్థానికుల సహాయంతో ఓలా క్యాబ్ ను నిలిపారు. వెనుక కుర్చున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి జారుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఓలా క్యాబ్ డ్రైవర్ మరుదును చితకబాది పోలీసులకు అప్పగించారు. మరుదును విచారించిన పోలీసులు మిగిలిన ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

English summary
A woman doctor luckily and narrowly escaped a sexual assault attempt by an Ola cab driver at Neelangarai in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X