వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలాంటి 'ఫుడ్' జన్మలో టేస్ట్ చేసి ఉండరు.. సోషల్ మీడియాను బెంబేలెత్తించిన వనిత..

|
Google Oneindia TeluguNews

ఇది ఇంటర్నెట్ కాలం.. సోషల్ మీడియాలో వచ్చే లైకులు,కామెంట్లనే సోషల్ స్టేటస్ అనుకునే కాలం.
ఇందుకోసం జనాలకు ఉపయోగపడే కంటెంట్‌తో పాపులారిటీని పెంచుకునేవాళ్లు కొందరైతే.. తమ వికారాలతో సోషల్ మీడియాలో జనాలను బెంబేలెత్తించేవాళ్లు మరికొందరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి రెండో కోవలోకి చెందినది.

కొత్త రకం ప్రయోగం..

కొత్త రకం ప్రయోగం..

సాధారణంగా ఛాయ్ తాగడాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు. రోజుకు పది కప్పులకు తగ్గకుండా తాగే ఛాయ్ ప్రియులూ ఉంటారు. అలాగే చికెన్‌ ప్రియులూ. రోజూ చికెన్ పెట్టినా సరే ఎంచక్కా లాగించేస్తారు. కానీ ఒక్కసారి ఊహించుకోండి.. ఛాయ్‌లో చికెన్ ముంచుకు తింటే ఎలా ఉంటుంది. ఛా.. అదేమి కాంబినేషన్ అనుకుంటున్నారా..? అవును, ఈ కొత్త రకం ప్రయోగంతో ఓ వనిత సోషల్ మీడియాలో జనాలను బెంబేలెత్తించింది.

ఈ ఐడియా తనది కాదట..

ఈ ఐడియా తనది కాదట..

పోకొస్‌చిక్ అనే ఓ రెడ్డిట్ యూజర్ ఛాయ్‌లో చికెన్ టిక్కాను ముంచుకు తినే వీడియోను పోస్ట్ చేసింది. ముందుగా ఓ బౌల్‌లో ఛాయ్‌ పోసి.. ఆపై అందులో చికెన్ టిక్కా వేసి బాగా కలిపింది. ఆ తర్వాత ఇక చెప్పేదేముంది.. ఆ విచిత్రమైన కాంబినేషన్‌ను తింటూ ఎంజాయ్ చేసింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేంటంటే.. నిజానికి ఈ ఐడియా తనది కాదట. ఇంతకుముందు ఛాయ్‌లో ఇడ్లీ ముంచుకు తినే వీడియో పోస్ట్ చేస్తే.. తదుపరి వీడియోలో ఛాయ్,చికెన్ కాంబినేషన్ ప్రయత్నించమని ఓ నెటిజెన్ సలహా ఇచ్చాడట.

నీ వీడియోలతో టార్చర్ పెట్టకు.. నెటిజెన్స్ వేడుకోలు..

నీ వీడియోలతో టార్చర్ పెట్టకు.. నెటిజెన్స్ వేడుకోలు..

ఇంకేముంది.. సదరు నెటిజెన్ ఇచ్చిన ఐడియాతో ఇలా కొత్త ప్రయోగానికి సిద్దమైపోయింది. ఈ వీడియోపై చాలామంది నెటిజెన్స్ రకరకాల ఫన్నీ కామెంట్స్ చేశారు. కానీ పోకొస్‌చిక్ మాత్రం ఈ కాంబినేషన్ భలే టేస్టీగా ఉందని తన పోస్టులో పేర్కొనడం గమనార్హం. ఇక ఈ ప్రయోగంపై ఓ నెటిజెన్ స్పందిస్తూ.. 'పాపం ఆ చికెన్.. రెండుసార్లు హత్య చేయబడింది..' అని కామెంట్ చేశాడు. మరో నెటిజెన్.. 'మమ్మల్ని హింసించడం కాస్త ఆపు..' అంటూ కామెంట్ చేశాడు. ఇక మరో నెటిజెన్.. 'ఈసారి జిలేబీని సాంబార్‌తో టేస్ట్ చేయండి' అని మరో కొత్త సలహా ఇచ్చాడు. ఆ సలహాకు భయపడిపోయిన ఓ నెటిజెన్.. దయచేసి ఇలాంటి ఐడియాలు ఇచ్చి ఆమెను జనాల పైకి ఉసిగొల్పకండి అంటూ వేడుకున్నంత పనిచేశాడు.

ఫుడ్ వీడియోలకు భలే డిమాండ్

ఫుడ్ వీడియోలకు భలే డిమాండ్

సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ ఉండే వీడియోల్లోఫుడ్ వీడియోలు ముందు వరుసలో ఉంటాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి చాలామంది ఫుడ్‌కి సంబంధించిన యూట్యూబ్ చానెల్స్ నిర్వహిస్తున్నారు. అయితే వెరైటీ పేరుతో ఇలాంటి చిత్ర విచిత్ర ప్రయోగాలతోనూ వ్యూస్ సంపాదిస్తున్నవారూ లేకపోలేదు. పొకొస్‌చిక్ అనే ఈ రెడ్డిట్ యూజర్.. ఇలా రకరకాల ఫుడ్ ప్రయోగాలతో జనాలను భయపెడుతోంది.

English summary
Chai and Chicken Tikka taste delicious when enjoyed separately. In fact, both the dishes have a strong fan base. For some people, chai is the cure to several life problems and for many others, Chicken Tikka is one of the best non-vegetarian dishes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X