చిన్నారులు ఏం చేశారు: భర్తతో గొడవ పడి నలుగురు చిన్నారులకు నిప్పంటిచిన మహిళ
హిమాచల్ ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్తతో గొడవపడిన ఓ మహిళ తన నలుగురు పిల్లలకు నిప్పంటిచి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే హమీర్‌పూర్ జిల్లాలోని అమ్గావ్ గ్రామంలో నివసిస్తున్న ప్రేమావతి తన భర్త పిల్లలతో కలిసి నివసిస్తోంది. వారికి నలుగురు పిల్లలు. ఇందులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. శుక్రవారం ఆమె భర్తతో గొడవ పడింది. అనంతరం పిల్లల కాళ్లు చేతులు కట్టేసి వారిపై కిరోసిన్ పోసి నిప్పటించింది.
పిల్లలపై నిప్పంటిచిన తర్వాత ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలు సప్నా(7), ప్రశాంత్ (5) స్నేహ (3), దివ్యాన్ష్ (1) లపై నిప్పంటించింది ప్రేమావతి. ఇందులో ఏడాది బాలుడు దివ్యాన్ష్ అక్కడికక్కడే మృతి చెందగా..సప్నా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రేమావతి, ప్రశాంత్, స్నేహలను చికిత్స కోసం ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ప్రేమావతి , స్నేహలు తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం ప్రశాంత్ చికిత్స పొందుతున్నాడని తెలిపిన వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టంకు పంపినట్లు ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ గొడవలపై తమకేమీ తెలియదని స్థానికులు చెబుతున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications