పూజారి పాడు పని: మహిళను గదిలోకి పిలిచి..

బగద్‌లోని ప్రభుధామ్ ఆశ్రమంలో ఈ సంగఠన జరిగింది. మహిళ హర్యానాలోని మహేంద్రగడ్‌కు చెందింది. ఆ ప్రాంతంలో ప్రభుధామ్ ఆశ్రమం ప్రజాదరణ పొందింది. తాను గత ఏడెనిమిదేళ్లుగా ఆశ్రమానికి వెళ్తున్నానని, మాల్ సింగ్ అనే పూజారి తనను గదిలోకి రావాలని పిలిచి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె వివరించింది.
పూజారి ఆమె దుస్తులను చించేశాడని, ఆమెను వివస్త్రను చేయడానికి ప్రయత్నించాడని పోలీసులు చెప్పారు. తాను తప్పించుకుని బయటపడ్డానని ఆమె చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బయటకు వస్తున్న మహిళను చేతబడి చేస్తానని పూజారి బెదిరించినట్లు తెలుస్తోంది.
పోలీసులు మాల్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. కానీ అతన్ని అరెస్టు చేయలేదు. మహిళ చేసిన ఆరోపణలను ధ్రువీకరించిన తర్వాత అరెస్టుకు ఉపక్రమించాలని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications