అమెజాన్ డెలివరి బాయ్ అత్యాచారయత్నం కేసులో ట్విస్ట్: యువతి రివర్స్, అంతే !
నోయిడా: ఇ- కామర్స్ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ సంస్థ డెలివరి బాయ్ అత్యాచారం చేశాడని నోయిడాలో నమోదైన కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. అత్యాచారయత్నం కేసులో విచారణకు హాజరు కావాలని నోయిడా యువతికి రెండుసార్లు మనవి చేసినా ఆమె వచ్చి ఎలాంటి వివరణ ఇవ్వలేదని పోలీసు అధికారులు అంటున్నారు. రీ ప్లేస్ మెంట్ ఫిర్యాదుతో వస్తువులు వాపస్ తీసుకోవడానికి వచ్చిన డెలివరి బాయ్ అత్యాచారయత్నం చేశాడని నోయిడా యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు వాపస్ తీసుకుంటా !
అత్యాచారయత్నం చేసిన యువతిని రెండు సార్లు విచారణకు హాజరుకావాలని చెప్పినా ఆమె స్పందించడం లేదని నోయిడా పోలీసు అధికారులు అంటున్నారు. విచారణకు హాజరుకాలేని చెబుతున్న యువతి తాను కేసు వాపస్ తీసుకుంటానని చెబుతోందని నోయిడా పోలీసు అధికారులు తెలిపారు.

ఎందుకు చెప్పింది ?
డెలివరి బాయ్ అత్యాచారయత్నం చేశాడని ఫిర్యాదు చేసింది తన సోదరి, నేను కాదు, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, పోలీసుల ముందు విచారణకు తాను ఎందుకు హాజరౌతానని, అది సాధ్యం కాదని యువతి అంటోందని నోయిడా పోలీసులు అన్నారు.

డెలివరి బాయ్ ఏం చెప్పాడు !
అత్యాచారయత్నం కేసు నమోదు కావడంతో అమెజాన్ సంస్థ డెలివరి బాయ్ కి వెంటనే సమన్లు జారీ చేశారు. పోలీసుల ముందు విచారణకు హాజరైన డెలివరి బాయ్ వివరణ ఇచ్చాడు. అయితే డెలివరి బాయ్ అత్యాచారయత్నం చేశాడని ఎలాంటి సాక్షాలు లేకపోవడంతో అతన్ని అరెస్టు చెయ్యలేదని నోయిడా పోలీసు అధికారులు అంటున్నారు.

అమెజాన్ క్లారిటీ
పోలీసులకు ఫిర్యాదు చేసిన నోయిడా యువతి అంతుకు ముందు రెండు సార్లు రీప్లేస్ మెంట్ ఆర్డర్ చేశారని అమెజాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కస్టమర్ కేర్ కు సైతం ఆమె ఫోన్ చేశారని, రెండు సార్లు డెలివరి బాయ్ నోయిడాలోనియువతి ఇంటికి వెళ్లాడని అమెజాన్ ప్రతినిధులు అన్నారు. యువతి ఫిర్యాదుపై వాస్తవాలు తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చేస్తున్నారని, ఈ విషయంలో తాము సీరియస్ గా సరైన నిర్ణయం తీసుకుంటామని, యువతి విషయంలో తాము నిర్లక్షం చెయ్యమని అమెజాన్ ప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications