మహిళపై ఆగ్రాలో గ్యాంగ్ రేప్: ఆత్మహత్యాయత్నం

వివరాలు ఇలా ఉన్నాయి - తన ఇంటికి రావాలని మహిళ మిత్రుడు ఆకాష్ మహిళకు మగంళవారం రాత్రి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో జగదీష్‌పురా ప్రాంతంలోని దహ్తోరా గ్రామానికి చెందిన 20 మహిళ తన మిత్రుడిని కలవడానికి ఆ ఇంటికి వచ్చింది.
మిత్రుడు ఆకాష్ వెళ్లి పోయిన తర్వాత అతని మిత్రులు ముగ్గురు వచ్చి ఆమెపై లైంగిక దాడికి దిగారు. ఆమె భవనంలోని మూడో అంతస్థులో ఉన్న ఇంటిపై నుంచి దూకింది. గ్రామస్తులు రక్తం మడుగులో పడి ఉన్న ఆమెను చూసి ఆస్పత్రికి తరలించారు.
సీనియర్ పోలీస్ సూపరింటిండెంట్ షలాబ్ మాథూర్‌తో పాటు సీనియర్ అధికారులు బాధితురాలిని కలిశారు. బుధవారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications