గోవా బీచ్ లో గ్యాంగ్ రేప్: బట్టలు విప్పించి.. బాయ్ ఫ్రెండ్ ముందే!
పనాజీ: దక్షిణ గోవాలోని సెర్నాభతిమ్ బీచ్ లో ఒక మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గోవా రాజధాని పనాజీకి 50కి.మీ దూరంలో ఉన్న ఈ బీచ్ లో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
బీచ్ లో ఉన్న జంట వద్దకు వెళ్లి.. ఆ ముగ్గురు వారిని బెదిరించారని చెప్పారు. బలవంతంగా వారిచేత బట్టలు విప్పించి ఫోటోలు తీశారని, ఆపై డబ్బులు డిమాండ్ చేశారని వెల్లడించారు. అనంతరం బాయ్ ఫ్రెండ్ ముందే ఆమెపై గ్యాంగ్ రేప్ కి పాల్పడినట్టు చెప్పారు.

ప్రస్తుతం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు దక్షిణ గోవా ఎస్పీ అరవింద్ గవాస్ తెలిపారు. ఇప్పటికీ చాలామంది అనుమానితులను విచారించిన పోలీసులు.. ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications