భర్తను పొడిచారు: భార్య గ్యాంగ్ రేప్, హత్య

లక్నో: ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. పుణ్యస్నానానికి వెళ్లిన దంపతులను అడ్డగించి భర్తను పొడిచి, అతని కళ్ల ముందే భార్య మీద సామూహిక అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసి పరారైనారు.

ఆలీఘడ్ జిల్లాలోని కాస్ గంజ్ సమీపంలోని గ్రామంలో సునీల్ కుమార్ నివాసం ఉంటున్నాడు. ఇతను తన భార్యతో కలిసి గంగా నదిలో పుణ్యస్నానం చెయ్యడానికి వెళ్లాడు. పుణ్య స్నానం చేసి భార్యతో కలిసి సైకిల్ మీద ఇంటికి బయలుదేరాడు.

మార్గం మధ్యలో కొందరు సునీల్ కుమార్ దంపతులను అడ్డుకున్నారు. తరువాత కత్తితో సునీల్ కుమార్ ను దారుణంగా పొడిచారు. అతని కళ్ల ముందే భార్యను పోలాల్లోకి ఈడ్చుక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.

 Woman gangraped and killed in Uttar Pradesh

సృహ కోల్పోయిన ఆమె గొంతు నులిమి హత్య చేసి పరారైనారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సునీల్ కుమార్ కు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు చెప్పారు.

వరకట్నం కోసం సునీల్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి భార్యను హత్య చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ ఆరోగ్యం కుదటపడిన తరువాత పూర్తి వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+