సెక్స్ చేయడం లేదని భర్తని చంపిన భార్య, జీవిత ఖైదు

అహ్మదాబాద్: లైంగిక వాంఛను తీర్చేందుకు అంగీకరించని భర్తను దారుణంగా చంపేసిన మహిళకు అహ్మదాబాద్ నగర సెషన్స్ కోర్టు సోమవారం నాడు జీవిత ఖైదు శిక్షను విధించింది. శిక్షతో పాటు రూ.2వేల జరిమానాను విధించింది.

అడిషనల్ సెషన్స్ జడ్జి యూఎం భట్ ఈ శిక్షను విధించారు. నిందితురాలి పేరు విమ్లా వాఘేలా. ఆమె వయస్సు 54. భర్త హత్య కేసులో ఆమెను దోషిగా తేల్చిన జడ్జి ఆమెకు శిక్ష, జరిమానా విధించారు. ఆమె జరిమానా చెల్లించకుంటే మరో ఆరు నెలలు ఎక్కువగా శిక్ష అనుభవించవలసి ఉంటుంది.

Woman gets life term for killing husband

వివరాల్లోకి వెళ్తే శారదానగర్ ప్రాంతంలో నర్సింహ, విమ్ల దంపతులు ఉంటున్నారు. నవంబర్ 2, 2013న నర్సింహను, విమల హత్య చేసింది.

తనతో కాకుండా మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడని, తన కోరిక తీర్చడం లేదన్న కోపంతో ఆమె ఓ కర్రతో భర్త మరణించేంత వరకూ కొట్టింది. ఆపై భర్తను స్వయంగా హత్య చేశానని పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. కేసును విచారణ దాదాపు రెండున్నరేళ్లు సాగింది. న్యాయస్థానం యావజ్జీవ ఖైదును విధిస్తూ తీర్పు చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+