ఇక వీరెందుకు: విమానంలో మహిళకు పీరియడ్స్... సహాయం చేయని ఎయిరిండియా సిబ్బంది
ప్రముఖ ప్రభుత్వ రంగ విమానాయాన సంస్థ ఎయిరిండియాలో ప్రయాణం చేసిన ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మహిళకు ఇరెగ్యులర్ పీరియడ్స్ కావడంతో చాలా ఇబ్బంది పడింది. అయితే ఆ మహిళ విమానాశ్రయంలో ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొంది..? విమనాశ్రయంలో సిబ్బంది ఏం చేశారు..?

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన మహిళకు పీరియడ్స్
ఢిల్లీ నుంచి చెన్నై వెళుతున్న ఎయిరిండియా విమానం ఏఐ42లో ఈ మహిళ ప్రయాణం చేయాల్సి ఉంది. ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే మహిళకు పొత్తి కడుపులో నొప్పి రావడం ప్రారంభమైంది. దీంతో వెంటనే ఎయిర్‌పోర్టులో ఉన్న వాష్‌రూంకు వెళ్లింది. అక్కడ శానిటరీ ప్యాడ్స్ కనిపించలేదు. ఇక బ్లీడింగ్ ఎక్కువ అవుతుండటంతో ఏమి చేయాలో మహిళకు తోచలేదు. అక్కడే ఉన్న ఓ పనిమనిషిని అడుగగా శానిటరీ ప్యాడ్స్ కోసం ఫార్మాకు వెళ్లాల్సిందిగా సూచించింది.

విమానంలో కానీ విమానాశ్రయంలో కానీ కనిపించని శానిటరీ ప్యాడ్స్
రైల్వే స్టేషన్లలో, బస్టాండుల్లో కూడా శానిటరీ మెషీన్లు పెడుతున్న ఈ రోజుల్లో విమానాశ్రయంలో లేకపోవడం చాలా దారుణమని మహిళ అన్నారు. ఇక ఫార్మసీ వెతికే లోనే ఆమెకు ఎయిరిండియా సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. విమానం బయలుదేరేందుకు ఐదు నిమిషాలు మాత్రమే ఉందని ఎక్కడున్నా సరే బోర్డింగ్ గేటు దగ్గరకు చేరుకోవాలని ఎయిరిండియా ప్రతినిధి చెప్పారు. ఫోనులో తన పరిస్థితిని వివరించింది మహిళ కానీ తనకేమీ తెలియదన్నట్లుగా చెప్పిన ప్రతినిధి వెంటనే రాకపోతే విమానం బయలుదేరుతుందని చెప్పారు. ఇక చేసేదేమీలేక అలానే బోర్డింగ్ గేటు దగ్గరకు పరుగులు తీసింది.

విమాన సిబ్బంది నుంచి నిర్లక్ష్యమైన సమాధానం
ఇక విమానంలోకి వెళ్లి ఎయిర్ హోస్టస్‌ను శానిటరీ ప్యాడ్ కోసం అడిగింది మహిళ. అయితే తమ దగ్గర ఎలాంటి శానిటరీ ప్యాడ్లు లేవని చెప్పింది. ఇక తన సీటులోనే కూర్చున్న మహిళ అప్పటికే తను ధరించిన జీన్స్ ప్యాంటు రక్తపు మరకలతో తడిసిపోయిందని చెప్పింది. తను పొందుతున్న ఆవేదన గమనించిన మరో మహిళా ప్రయాణికురాలు తన వద్ద ఉన్న శానిటరీ ప్యాడ్స్‌లో ఒకటి తీసి ఇచ్చింది. దీంతో ఆ మహిళ మనస్సు నెమ్మదించింది.

చెక్‌లిస్టులో భాగంగా శానిటరీ ప్యాడ్స్‌ను విమానంలో ఉంచుతాం
మహిళల కోసం శానిటరీ ప్యాడ్స్ ఎందుకు అరేంజ్ చేయలేదని ఎయిర్‌పోర్టు పీఆర్ ప్రవీణ్ భట్నాగర్‌ను ప్రశ్నించగా అటువంటిదేమీ ఉండదని చెక్ లిస్టులో భాగంగా విమానంలో శానిటరీ ప్యాడ్స్ కూడా పెట్టాలనేది నిబంధనగా ఉందని తెలిపారు. తమ క్యాబిన్ సిబ్బందికి ఒక్క వడ్డించడంలోనే శిక్షణ ఇవ్వమని... అత్యవసర పరిస్థితుల్లో కూడా మెడికల్‌గా ఎలా రియాక్ట్ అవ్వాలో అనేదానిపై కూడా శిక్షణ ఇస్తామని భట్నాగర్ చెప్పారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications