ఉపాధ్యాయురాలికి ఫేస్‌బుక్ ద్వారా.. అసభ్య సందేశాలు పంపిన విద్యార్థి

ఓ పాఠశాల విద్యార్థి ఫేస్‌బుక్ ద్వారా ఏకంగా మహిళా ఉపాధ్యాయురాలికే అసభ్య పదజాలంతో మెసేజ్ లు పంపిన బాగోతం మహారాష్ట్రలోని నవీ ముంబై నగరంలో వెలుగుచూసింది.

ముంబై : ఓ పాఠశాల విద్యార్థి ఫేస్‌బుక్ ద్వారా ఏకంగా మహిళా ఉపాధ్యాయురాలికే అసభ్య పదజాలంతో మెసేజ్ లు పంపిన బాగోతం మహారాష్ట్రలోని నవీ ముంబై నగరంలో వెలుగుచూసింది.

నవీ ముంబై నగరానికి చెందిన ఉపాధ్యాయురాలు(27) ఏడాది క్రితం పంచగని బోర్డింగ్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగం మానేసింది. పంచగని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యారితోపాటు కొందరు ఉపాధ్యాయులు ఫేస్‌బుక్ ఫ్రెండ్ లిస్టులో ఉన్నారు.

facebook-on-mobile

ఉన్నట్టుండి ఆ విద్యార్థి తనకు ఫేస్ బుక్ ద్వారా అసభ్య సందేశాలు పంపించాడని మహిళా టీచరు ఆవేదనగా వ్యక్తం చేశారు. ఆ అసభ్య సందేశాల స్క్రీన్ షాట్లు తీసి, వాటిని తనతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయులకు ఆమె పంపించారు.

అంతే ఆ విద్యార్థి వెంటనే తన ఫేస్ బుక్ ఖాతాను డీ యాక్టివేట్ చేశాడు. తన మాజీ విద్యార్థి తనకు పంపించిన అసభ్య సందేశాల స్క్రీన్ షాట్లను జత చేసిన ఉపాధ్యాయురాలు నవీ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మైనర్ అయిన పాఠశాల బాలుడి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+