మహిళలపై అసభ్యంగా: సైబర్ సిటీలో టెక్కీ అరెస్టు
గుర్గావ్: ఇద్దరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణపై పోలీసులు సైబర్ సిటీలో 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేశారు. ఫరీదాబాద్‌కు చెందిన అతను రాత్రి పూట విధులను పూర్తి చేసుకుని గురువారం ఉదయం భవనంలోకి ప్రవేశిస్తున్న మహిళను చేతులతో తాకాడు.
అయితే, ఆ మహిళ ఆ విషయాన్ని గుర్తించనట్లుగా మౌనంగా వెళ్లిపోయింది. దాంతో ఉత్సాహం సంతరించుకున్న అతను మరో మహిళపై కూడా దాడి చేశాడు. అయితే, రెండో మహిళ ధైర్యం చేసి అతని చేయి పట్టుకుని గట్టిగా అరిచింది.

దాంతో భవనం వద్ద కాపలా ఉన్నవారు పరుగెత్తుకుని వచ్చారు. ఆ తర్వాత ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. కాపలాదారులు అతన్ని చుట్టుముట్టడంతో పారిపోవడానికి ప్రయత్నించాడు. దాదాపు పది నిమిషాల పాటు వారితో అతను దాగుడుమూతలు ఆడాడు.
పోలీసులు వచ్చి అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు అంకిత్ బోహ్రాను పోలీసులు శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.












Click it and Unblock the Notifications