ప్రేమోన్మాది: ప్రేమించలేదని జిమ్ ట్రైనర్‌పై యాసిడ్ దాడి, ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది ఓ యువతిపై యాసిడ్‌తో దాడి చేశాడు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఆ తర్వాత నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. భోపాల్‌లోని ఓ జిమ్‌లో శిక్షకురాలిగా పని చేస్తున్న సదరు యువతి(20)ని ప్రేమిస్తున్నానని గత కొంతకాలంగా నిందితుడు సంజయ్ పాటిల్ వెంటపడుతున్నాడు. ఇందుకు ఆ యువతి అంగీకరించకపోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో సంజయ్ పాటిల్ ఆమె వెంటపడ్డాడు. దీంతో ఆమె దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసులు మరో స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరడంతో ఆమె మళ్లీ బయటికి వచ్చింది.

మళ్లీ ఆమె వెంటపడ్డ సంజయ్ పాటిల్.. ఆమెను అడ్డుకుని ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు నిందితుడ్ని పట్టుకుని చితకబాదారు. కాగా, తనతోపాటు తెచ్చుకున్న కత్తితో నిందితుడు సంజయ్ పాటిల్ పొడిచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ప్రస్తుతం బాధిత యువతి 50శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా నిందితుడు, తనను, తన కుటుంబసభ్యులను వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది.












Click it and Unblock the Notifications