మహిళపై 27 కత్తిపోట్లు, హత్య: ఏడ్చేసిన నిందితుడు

న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలో జరిగిన ఓ మహిళ హత్య మిస్టరీ వీడింది. పశ్చిమ ఢిల్లీలోని ఇంట్లో 62 ఏళ్ల మహిళ సోమవారంనాడు హత్యకు గురైంది. ఆమెను కత్తితో పొడిచి చంపారు. అయితే, అది పని మనిషి పనే అయి ఉంటుందని అనుమానించారు. కానీ, వ్యాపారంలో నష్టపోయిన ఓ వ్యాపారి ఆమెను హత్య చేసి దోపిడీకి యత్నించినట్లు బయటపడింది.

మహిళ ఇంటి పక్కన ఉండే వ్యక్తి వ్యాపారంలో నష్టపోయాడు. దాంతో దోపిడీ కోసం మహిళను హత్య చేసినట్లు పోలీసులు కనిపెట్టారు. మాంసం కోసే కత్తితో సులోచనా బన్సాల్ అనే మహిళను అతను 27 సార్లు కత్తితో పొడిచాడు. మహిళ మనవడిని అతను బాత్రూంలో నిర్బంధిచాడు.

కొన్ని వారాల ముందుగానే అనురాగ్ జైన్ అనే వ్యాపారి హత్యకు పథకం వేసుకున్నాడని పోలీసులు చెప్పారు. అందుకు ఇంటి రెక్కీ కూడా నిర్వహించాడని అన్నారు. ఇంటి వద్ద నెంబర్ ప్లేట్ లేని ఎర్ర రంగు పల్సర్‌ను పోలీసులు గుర్తించారు. ఇంజిన్ నెంబర్ ద్వారా బైక్ యజమానిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

తొలుత మాట్లాడినప్పుడు ఆ బైక్ తనదేనని అనురాజ్ జైన్ అంగీకరించాడు. ఫ్టాట్ టైర్ కావడంతో తాను అక్కడ బైక్‌ను నిలిపేసినట్లు చెప్పాడు. అయితే, నెంబర్ ప్లేట్ ఎందుకు తొలగించావనే ప్రశ్నకు అతను సరిగా సమాధానం చెప్పలేకపోయాడు. దాంతో తాము అతన్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

 Woman hacked 27 times by neighbour, dead

విచారణ సమయంలో అనురాగ్ జైన్ ఎడ్చేశాడు. నేరాన్ని అంగీకరించాడు. ఆర్థిక నష్టంతో తాను, తన తండ్రి బాధపడుతున్నామని, బన్సాల్ కుటుంబం ధనవంతులనే విషయం జైన్‌కు తెలుసునని, దాంతో వాళ్ల ఇంట్లో భారీగా నగలు, నగదు లభించవచ్చునని భావించామని అతను పోలీసులకు చెప్పాడు.

జైన్ పశ్చిమ విహార్‌లో కత్తిని కొన్నాడు. తనను గుర్తించకుండా మాస్క్ ధరించాడు. సోమవారం ఉదయం ప్రవహరీ గోడ దాటి సిసిటివీ కెమెరా కనెక్షన్లు తొలగించాడు. చాలా ఎత్తులో ఉండడంతో మరో రెండింటిని తొలగించలేకపోయాడు. ఉదయం 11 గంటలకు మహిళ భర్త బయటకు వెళ్లిపోయాడు. తలుపులు తెరిచే ఉన్నాయి. జైన్ ఇంట్లోకి ప్రవేశించగానే సులోచనా జైన్ పెద్దగా అరిచింది. పరుగెత్తడానికి ప్రయత్నించింది. అయితే, అతను వెంటాడి ఆమెను కత్తితో పొడిచి చంపాడు.

నగదు, నగలు, సిసిటివీ చిత్రాలను రికార్డు చేసిన డివిఆర్‌ను ఎత్తుకెళ్లాడు. అయితే, బన్సాల్ కొడలు బెల్లు కొట్టడంతో జైన్ హడావిడిగా పారిపోవాల్సి వచ్చింది. ఆ హడావిడిలో అతను బైక్‌ను మరిచిపోయాడు. కోడలు వచ్చి చూసేసరికి అత్త రక్తంమడుగులో పడిపోయి ఉంది. ఆమెను మహరాజా అగ్రసేన్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+