తండ్రిరూప రాక్షసుడు.. కూతురిపై పాడుపని యత్నం, గొడ్డలితో నరికిన మహిళ
డెహ్రాడూన్ : కలికాల ప్రభావమో ? లేక ఆధునిక పోకడలో తెలియదు కానీ .. సమాజంలో వావి వరుస మరచిపోతున్నారు. ఇక మద్యం తాగిన కొందరు తమ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. మన, పర అనే బేధం లేకుండా లైంగికదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కొన్ని చోట్ల తమ కూతుర్లపైనే తండ్రులు లైంగికదాడికి ఒడిగట్టడం ఆందోళన కలిగిస్తోంది.
కళ్లకు పొరలు ..
అచ్చం ఇలాగే ఉత్తరాఖండ్‌లో కూడా ఓ ఘటన జరిగింది. ఉత్తరకాశీ జిల్లా బాడ్‌కోట్‌కు చెందిన 51 ఏళ్ల తండ్రి వావి వరుస మరిచాడు. గత సోమవారం తమ బంధువుల పంక్షన్ జరిగింది. ఆ వేడుకకు తన కూతురు కూడా వచ్చింది. ఆమె అప్పటికే పెళ్లైంది. ఫంక్షన్ పూర్తిచేసుకొని ఇంటికొచ్చింది. అయితే అలా రావడం ఆమె చేసిన తప్పైంది. దీంతోపాటు మిగతా కుటుంబసభ్యులు కూడా ఆ వేడుకలో ఉన్నారు. ఫంక్షన్‌కు హాజరై ఇంటికొచ్చిన తండ్రి .. కీచకుడిలా మారాడు. తన కూతురుపై లైంగికదాడి చేయబోయాడు.

కాళి అవతారం ...
మత్తులో ఉన్న తండ్రి కూతురిపై దాడి చేయబోయాడు. దీంతో ఆమె ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఏం జరుగుతుంది .. నాన్న అని పిలిచినా ఆ కీచకుడు వదిలిపెట్టలేదు. అంతేకాదు తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళ తన తండ్రిని నెట్టివేసింది. దగ్గరలో ఉన్న గొడ్డలి తీసుకొని కాలిమాత అవతారమెత్తింది. తనపై లైంగికదాడి చేయబోయిన తండ్రిపై గొడ్డలితో దాడి చేసింది. పలుమార్లు కొట్టడంతో అతను మూర్చపోయి .. చనిపోయాడు. తర్వాత ఇంటికొచ్చిన వారు రక్తపుమడుగులో ఉన్న తండ్రిని చూసి ఏం జరిగిందని అడిగారు. దీంతో జరిగిన ఘటన గురించి తెలిపి రోదించింది ఆ మహిళ. సోమవారం రాత్రి జరిగిన ఘటనపై స్థానికుల సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. తండ్రిని కడతేర్చిన కూతురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు లైంగికదాడి చేయబోతే హతమార్చినట్టు తెలిసింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications