వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీన్ రివర్స్: మేల్ ప్రాస్టిట్యూట్‌గా మారమని భర్తకు భార్య వేధింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇండోర్: ఓ వ్యక్తికి ఆయన భార్య నరకం చూపించిన సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పింప్ (మగ వ్యభిచారి)గా మారమని అతనిని నిత్యం వేధిస్తోంది. ఓ వ్యక్తికి 2011లో పెళ్లయింది. పెళ్లైన కొద్ది రోజులకే ఆ భార్య అతనిని తల్లిదండ్రుల నుండి వేరు చేసింది.

అక్కడి నుండి వారు కూచోడ్‌కు వెళ్లారు. ఈ గ్రామం ఆ భార్యకు సంబంధించిన బంధువులు నివసించినది. ఇది నీముచ్ చిల్లాలో ఉంది.

అక్కడకు వెళ్లాక ఆమె తన సోదరుడితో కలిసి భర్తను వేధించడం ప్రారంభించింది. అక్కడ వారిద్దరు కలిసి ఆ భర్తను పింప్‌గా మారమని ఒత్తిడి చేశాయి. మండసౌర్ - నీముచ్ మధ్యగల హైవేలో పింప్‌గా పని చేయమని చెప్పారు. స్థానికంగా ఉండే ఓ సామాజిక వర్గం ట్రెడిషనల్‌గా సెక్స్ వర్కర్స్.

Woman harasses husband, forces him into flesh trade

అయితే, పింప్‌గా మారేందుకు అతను నిరాకరించడంతో.. ఆ భార్య తన సోదరుడితో కలిసి మరింత వేధించింది. అతని పైన చేయి కూడా చేసుకున్నారట. వారు అతనికి క్రమంగా పిల్స్ ఇచ్చి.. అతని మానసిక ఆరోగ్యం పైన ప్రభావం పడేలా చేశారు.

అయితే, ఆ భర్త వారి నుండి తప్పించుకొని ఇండోర్ వచ్చాడు. అతను తన భార్య వేధింపులను తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భార్య, తన సోదరుడితో కలిసి తన భర్తను, భర్త కుటుంబాన్ని పలుమార్లుబెదిరించారని చెబుతున్నారు. వారు ఇచ్చిన పిల్స్ (మందులు) వల్ల ఆ భర్త మానసిక పరిస్థితి పైన ప్రభావం పడింది. పోలీసులు దీని పైన విచారిస్తున్నారు. కేసు ఫైల్ చేసి విచారించాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.

English summary
When Navneet married Mamta in 2011, he never imagined that his life would turn into a living hell and he would end up a psychotic wreck.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X