కొడుకు మర్మాంగం కోసి, బిడ్డ గొంతు కోసి తల్లి...

బళ్లారి: ఓ తల్లి తన పిల్లల పట్ల అత్యంత దారుణమైన చర్యకు ఒడిగట్టి ఓ తల్లి తాను ఉరేసుకుంది. పిల్లలపై కత్తితో దారుణంగా దాడి చేసి, గాయపరిచింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లి సిరిగేరి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వారు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

కరూరు గ్రామానికి చెందిన మహేష్, లక్ష్మి దంపతులకు విద్య (5) అనే కూతురు, శశిధర్ (3) అనే కుమారుడు ఉన్నారు. కుటుంబ సమస్యల కారణంగా దంపతులు బుధవారం రాత్రి గొడవ పడ్డారు. తర్వాత మహేష్ పని మీద బయటకు వెళ్లాడు.

woman has attacked her two children with a knife

భర్త బయటకు వెళ్లిన సమయంలో లక్ష్మి పిల్లలను గదిలోకి తీసుకుని వెళ్లింది. వారిపై చాకుతో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో ఐదేళ్ల విద్య తీవ్రంగా గాయపడింది. గొంతుపై, తలపై, ఇతర శరీర భాగాలపై లక్ష్మి చాకుతో పొడిచింది.

మూడేళ్ల శశిధర్ మర్మాంగాన్ని కోసింది. తలపై దాడి చేసింది. ఆ తర్వాత అదే గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. రాత్రి పది గంటల సమయంలో ఇంటికి వచ్చిన మహే,్ తలుపులు తట్టాడు. లోపలి నుంచి స్పందన లేకపోవడంతో అనుమానంతో తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించాడు.

రక్తపు మడుగులో భార్యాపిల్లలను చూసి, వారిని విమ్స్ ఆస్పత్రికి తరలించాడు. లక్ష్మి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఐసియులో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+