బాపు కొడుకుని వెతకొద్దని మహిళా అధికారికి బెదిరింపు

 Woman IPS officer gets threat call for searching Asaram's son
న్యూఢిల్లీ: ఆశారాం బాపూ తనయుడు నారాయణ సాయిని వెతకవద్దని ఓ పోలీసు అధికారిణికి బెదిరింపు వచ్చింది. సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కా చెల్లేళ్లపై ఆశారాం, ఆయన తనయుడు నారాయణ సాయిలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నారాయణ సాయి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అతని కోసం అన్వేషించవద్దని బెదిరిస్తూ ఆ కేసును పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారిణికి ఫోన్ వచ్చింది. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లలో అక్క పైన ఆశారాం, తనయుడి పైన నారాయణ సాయి లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది.

అక్టోబర్ 16న ఈ కేసును పర్యవేక్షిస్తున్న ఐపిఎస్ అధికారిణి శోభా బుటడేకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి, సాయిని వెతకడానికి ప్రయత్నిస్తే చంపుతామని బెదిరించారని ఉమ్రావ్ పోలీసు స్టేషన్ ఎస్సై తెలిపారు. ఆ ఫోన్ మధ్యప్రదేశ్ నుండి వచ్చినట్లుగా విచారణలో వెల్లడైందని, దర్యాఫ్తు చేస్తామన్నారు.

నారాయణ సాయికి రవి శంకర్ సలహా

ఆశారాం బాపు తనయుడు నారాయణ సాయికి పండిట్ రవిశంకర్ సలహా ఇచ్చారు. కోర్టు ఎదుట లొంగిపోవాలని సూచించారు. అతను తప్పు చేయకపోతే పోలీసులకు భయపడాల్సిన అవసరం లేదన్నాడు. ఈ అంశం యావత్ దేశ సంత్ సమాజానికి అప్రతిష్టను తెచ్చిపెట్టిందని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+