16వ అంతస్థు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
ముంబై: సినిమాలకు, టెలివిజన్ సీరియళ్లకు కళావస్తువులు సరఫరా చేసే 35 ఏళ్ల మహిళ ఆపార్టుమెంట్ 16వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ముంబైలోని అంధేరీ శివారుల్లో ఈ సంఘటన మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగిందని పోలీసులు చెప్పారు.
మృతురాలిని ఏక్తా బబ్బర్‌గా గుర్తించారు. డిప్రెషన్ కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. లోఖాండ్వాలా కాంప్లెక్స్ ఏరియాలోని గ్రీన్ ఎకర్స్ అపార్టుమెంట్‌లోని 16వ అంతస్థులో ఆమె నివసిస్తోంది. ఆదివారం రాత్రి పదకొండున్న గంటల ప్రాంతంలో ఆమె పైనుంచి దూకినట్లు ఓషివారా పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ సుభాష్ వేలె చెప్పారు.

బబ్బర్ తండ్రి ఆరు నెలల క్రితం మరణించాడని, ఫ్లాట్‌లో ఆమె తల్లితో కలిసి ఉంటోందని, ఆమె బెడ్రూం నుంచి దూకినప్పుడు తల్లి బెడ్రూంలోనే ఉందని ఆయన చెప్పారు. ఆమె డిప్రెషన్‌కు, ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా ఆమెకు పని దొరకడం లేదని, దీంతో ఆమె నిస్పృహలోకి జారుకుందని పోలీసులు అంటున్నారు. సూసైడ్ నోట్ ఏదీ లభించలేదు. పోస్టుమార్టం నిమిత్తం బబ్బర్ శవాన్ని కూపర్ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications