ప్రేమ నిరూపణ: ఫ్లై ఓవర్‌పై నుంచి దూకిన యువతి

 Woman jumps off flyover to prove her love
న్యూఢిల్లీ: తన ప్రేమను నిరూపించుకోవడానికి ఓ యువతి ఢిల్లీ ఫ్లై ఓవర్ నుంచి కిందికి దూకింది. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ వద్ద మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమెను వెంటనే లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు. ఆమె రెండు కాళ్లు కూడా ఫ్రాక్చర్ అయ్యాయి.

ఆ యువతిని పోలీసులు అనితగా గుర్తించారు. తన ప్రియుడు వాసింతో వాగ్వివాదానికి దిగిన ఆమె ఫ్లై ఓవర్ మీది నుంచి దూకింది. గత ఐదేళ్లుగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. నిరుడు ఆమె సొంత నగరం ఆగ్రాకు వెళ్లింది.

వసీం మరో యువతితో పెళ్లికి నిశ్చితార్థం చేసుకున్నాడని ఓ ఫ్రెండ్ చెప్పడంతో అతన్ని కలవడానికి అనిత ఢిల్లీ వచ్చింది. అంతకు ముందు మొబైల్ అప్లికేషన్స్‌లో తన వసీంకు కాబోయే భార్య చిత్రాలను కూడా చూసింది. దీంతో ఆగ్రహించిన అనిత అతన్ని కలవడానికి ఢిల్లీ వచ్చింది.

వసీం, అనిత తీవ్రంగా వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా - నీకు ప్రేమ ఉంటే ఈ ఫ్లై ఓవర్ మీది నుంచి దూకు అని వసీం అన్నాడు. అంతే, ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా పై నుంచి దూకేసింది. వసీంను పెళ్లి చేసుకుంటానని అనిత అతని కుటుంబ సభ్యులను కూడా అడిగింది. అయితే, అందుకు వారు అంగీకరించలేదని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+