కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్: పెట్రోల్ పంప్ పక్కన పడేసి పరారీ

Recommended Video

    ఇద్దరిపై రేప్.. ఓలా క్యాబ్ డ్రైవర్ నిర్వాకం..!

    ఫరీదాబాద్: హర్యానాలో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ముగ్గురు వ్యక్తులు శనివారంనాడు 22 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేసి, ఆమెపై కదులుతున్న కారులో రెండు గంటల పాటు సామూహిక అత్యాచారం చేశారు.

    ఈ సంఘటన హర్యానాలోని ఫరిదాబాదులో జరిగింది. అత్యాచారం చేసిన తర్వా ఆమెను సిక్రి గ్రామంలోని పెట్రోల్ పంపు వద్ద పడేసి పారిపోయారు. ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు.

    Gangrape

    ఆ సంఘటన సాయంత్రం 7 గంటలకు జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంలో (ఎస్‌యువి)లోకి బలవంతంగా లాక్కున్నారని, ఆ తర్వాత వాహనంలో ఆమెపై అత్యాచారం చేశారని అన్నారు.

    ఆమె శరీరంపై చారికలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని చెప్పారు. దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఏ విధమైన అరెస్టులూ జరగలేదు.

    అదే రోజు జింద్ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+