భర్తకొడుకులను చంపేసి మహిళ ఆత్మహత్య

నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్ టిమ్కీ ప్రాంతంలో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. భర్తను, కుుమారుడిని గొంతు కోసి హత్య చేసి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. వారు నివసించే ఇంటి ముందు దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఈ సంఘటన వెలుగు చూసింది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - నిషా (25), సర్వార్ ఆలం (35) దంపతులు కుమారుడు డాడు (5)తో కలిసి టిమ్కీలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే తరుచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఘటనకు ముందు రోజు కూడా వారు ఘర్షణ పడ్డారని, పిల్లవాడి ఏడుగు కూడా బిగ్గరగా వినిపించిందని ఇరుగుపొరుగువారు పోలీసులకు చెప్పారు.

Woman kills husband, son; commits suicide

ఏమైందో తెలియదు గానీ భర్తను, కుమారుడ్ని మహిళ పదునైన కత్తితో గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆ సంఘటన శుక్రవారం తెల్లవారు జామున జరిగినట్లు భావిస్తున్నారు. వాసనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సాయంత్రానికి వారు మరణించిన విషయం వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+