అడ్రస్ కోసం వెతుకుతుండగా,ఆమె చున్నీ లాగి అసభ్యంగా ప్రవర్తించారు. దంపతులు ఏం చేశారంటే

అడ్రస్ వెతికితోంటే, అమానుషానికి పాల్పడ్డారు ఇద్దరు దుండుగులు. తమను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించిన పాపానికి రక్తం వచ్చేలా కర్రతో కొట్టారు.వారిని అడ్డుకొనే వారే లేకుండా పోయారు.

లక్నో:అడ్రస్ వెతికితోంటే, అమానుషానికి పాల్పడ్డారు ఇద్దరు దుండుగులు. తమను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించిన పాపానికి రక్తం వచ్చేలా కర్రతో కొట్టారు.వారిని అడ్డుకొనే వారే లేకుండా పోయారు. ఈ ఘటనను ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒక నిందితుడిని పోలీసులు అరెస్టుచేశారు. మరో నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మణిపురి జిల్లాల్లో ఈ ఘటన చోటుచేసుకొంది. నవదంపతులు తాము వెళ్ళాల్సిన ప్రాంతం అడ్రస్ వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఓ మార్కెట్ లో స్థానికులను వారు అడ్రస్ ను అడుగుతున్నారు.

assaulted
అయితే ఆ మార్కెట్ లో నే ఉన్న ఓ వ్యక్తి ఆ మహిళ పట్ల అనాగరికంగా ప్రవర్తించాడు. ఆమె చున్నీని లాగి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్థించాడు. అయితే దీన్ని గమనించిన ఆమె భర్త వారించాడు.

దీంతో అతనికి కోపం వచ్చింది. మహిళను వేధించకుండా అడ్డుపడుతున్నాడని తన స్నేహితుడితో కలిసి కర్రతో భార్య, భర్తలను విపరీతంగా కొట్టారు. ఈ ఘటనలో ఆ మహిళ తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు ఈ ఘటనను సినిమా చూసినట్టు వినోదం చూశారు తప్ప ఆపలేదు. ఈ ఘటనను ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల్లో ఒకరిని ఆనంద్ యాదవ్ గా గుర్తించారు. మరోకరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిందితులను అరెస్టు చేయకపోతే తనను తాను కాల్చుకొని చనిపోతానని బాధితురాలు పోలీసులకు చెప్పింది.నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+