దారుణం: భార్యను అర్ధనగ్నంగా ఊరేగించిన భర్త

Woman paraded half-naked by her husband in the presence of teenage daughter
న్యూఢిల్లీ: కట్టుకున్న భార్యను ఓ తాగుబోతు భర్త నడిరోడ్డులో అర్ధనగ్నంగా ఊరేగించిన దారుణ సంఘటన రాజస్ధాన్ రాష్ట్రంలోని సికార్ జిల్లాలో ఆదివారం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కేసర్ సింగ్ (47) అనే వ్యక్తి మద్యానికి బానిసై అస్తమానం భార్యను హింసిస్తూ ఉండేవాడు. ఆదివారం బాగా కొట్టి... అంతటితో ఊరుకోకుండా ఆమెను సికార్ జిల్లాలోని మార్కెట్ ప్రాంతంలో వయసుకి వచ్చిన తన కూతురు ఎదుటే అర్ధనగ్నంగా బజారులో వూరేగించాడు.

బాధితురాలికి ముగ్గురు పిల్లలు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసర్ సింగ్‌ను అరెస్టు చేసి దంతారామ్‌గడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కేసర్ సింగ్ వ్యవసాయ కూలీ.

విషయం తెలుసుకున్న సికార్ జిల్లా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్... తహశీల్దార్‌ను హూటాహుటిన గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా కోరారు. రాజస్ధాన్ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఇన్‌చార్జి కిరణ్ కాన్వర్ ఈ ఘటనపై మండిపడ్డారు. వివిధ ఐపిసి సెక్షన్ల కింద నిందితుడుపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+