• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహిళా పైలట్‌‌కు వేధింపులు: నీ భర్త ఇక్కడ లేరు..నేను ఒంటరిగా ఉన్నా...ఏమంటావ్.?

|

మహిళలు ఏరంగంలో ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వారికి మాత్రం పురుషుల నుంచి ఎదురవుతున్న లైంగిక వేధింపులు తగ్గడం లేదు. ఇప్పటికే ఈ లైంగిక వేధింపుల బారిన పడి, మానసికంగా నలిగిపోయిన చాలామంది మహిళలు పలువురి ప్రముఖలుపై గళం విప్పారు. ఒక్కరు ముందడుగు వేయగానే దేశంలోని చాలామంది సెలబ్రిటీలుగా ఉన్న మహిళలు కూడా తమపై గతంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి చాలా ధైర్యంగా చెప్పారు. ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారి తీసింది. తాజాగా మరో లైంగిక వేధింపుల ఫిర్యాదు వెలుగు చూసింది. అయితే ఇది ఓ మహిళా పైలట్ ఎయిరిండియా సంస్థలో ఫిర్యాదు చేసింది.

అమెరికా చట్టసభల్లో కొత్త బిల్లు: ఇక్కడ చదివి మాదేశానికే పని చేయాలనుకుంటేనే వీసా మంజూరు

 మహిళా పైలట్లకు తప్పని లైంగిక వేధింపులు

మహిళా పైలట్లకు తప్పని లైంగిక వేధింపులు

ఎయిరిండియాలో పనిచేస్తున్న ఓ మహిలా పైలట్ తన సీనియర్ పైలట్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు చేసింది. తనను పలు అసభ్యకర ప్రశ్నలు ఆమెను అడిగినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది. ముందగా ట్రైనింగ్ సెషన్ పూర్తవగానే మే 5న హైదరాబాదులోని ఓ రెస్టారెంట్లో డిన్నర్‌కు రమ్మన్నాడని మహిళా పైలెట్ తెలిపింది. ఆ సీనియర్ పైలట్‌తో కలిసి పలుమార్లు విమానంను రైడ్ చేసినందున అతను చాలా నమ్మకస్తుడన్న అభిప్రాయం కుదరడంతో డిన్నర్‌కు ఒప్పుకున్నట్లు ఆ మహిళా పైలట్ పేర్కొంది. ఇక రాత్రి 8 గంటల సమయంలో అతనితో కలిసి డిన్నర్‌కు వెళ్లినప్పుడు అతని నిజస్వరూపం బయటపడిందని చెప్పారు.

శృంగారంలో పాల్గొనకుండా ఎలా ఉన్నావ్..?

శృంగారంలో పాల్గొనకుండా ఎలా ఉన్నావ్..?

ముందుగా తన వైవాహిక జీవితం తనకు సంతృప్తి ఇవ్వడం లేదని మాటలు ప్రారంభించాడని ఆ తర్వాత జీవితంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పాడని ఆ మహిలా పైలట్ వెల్లడించింది. అంతేకాదు తన భర్తకు దూరంగా ఎలా ఉండగలుగుతున్నావని ప్రశ్నించినట్లు చెప్పిన మహిళా పైలట్.... అసలు రోజూ శృంగారంలో పాల్గొనకుండా ఎలా ఉండగలుగుతున్నావని పలు ఇబ్బందికర మాటలు మాట్లాడాడని ఆ మహిళా పైలట్ ఫిర్యాదులో తెలిపింది.

 పైలట్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మహిళా పైలట్

పైలట్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మహిళా పైలట్

ఇక ఆ సీనియర్ పైలట్ తన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడో పసిగట్టిన ఆ మహిళా పైలట్... ఇలాంటి మాటలు మాట్లాడకండి... తనకు నచ్చదని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చి క్యాబ్‌లో వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మరుసటి రోజు ఆమె ఎయిరిండియా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. మహిళలు అన్ని రంగాల్లో రానిస్తున్నప్పటికీ పురుషులు మాత్రం వారిని ఇంకా ఒక శృంగార బొమ్మలానే చూస్తున్నారని మహిళా సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. మహిళను ఈ సమాజంలోని పురుషులు ఒక్క శృంగార కోణంలోనే చూస్తున్నారని మండిపడ్డాయి. మహిళలు ఎక్కడా స్వతంత్రంగా ఉండలేకపోతున్నారని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
A woman pilot who works for state run airlines Airindia has filed a complaint on his senior pilot who sexually harrased her. Air india said that a probe has been ordered into this matter.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more