తనను వీడియో తీస్తున్నాడని మహిళా ప్రొఫెసర్, జుట్టుపట్టి కొట్టాడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ మహిళా లెక్చరర్‌ను మరో పురుష లెక్చరర్ జుట్టు పట్టుకొని కొట్టిన ఘటన ఇంటర్నెట్లో హల్‌చల్ సృష్టిస్తోంది. ఢిల్లీలో ఇద్దరు ప్రొఫెసర్ల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి లెక్చరర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతున్న సమయంలో పురుష లెక్చరర్.. సదరు మహిళా లెక్చరర్‌ను వీడియో, ఫోటో తీసేందుకు ప్రయత్నించాడు. దీనిని ఆమె అడ్డుకోవడంతో అతను ఆమె జుత్తు పట్టుకొని లాగి, కొట్టాడని తెలుస్తోంది.
వీడియో ఫుటేజీలో, పురుష లెక్చరర్ ఆమె ఫోటో తీస్తున్న సమయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. తనను వీడియో లేదా ఫోటోగ్రాఫ్ తీయడాన్ని ఆమె అడ్డుకుంది. అతని చేతిలో ఉన్న ఫోన్‌ను కిందకు తోసేసింది.
ఆమె చర్యతో ఆగ్రహం చెందిన సదరు పురుష ప్రొఫెసర్ ఆమెను కొట్టాడు. ఇరువురు కలహించుకున్నారు. ఈ సంఘటన గత ఏడాది నవంబర్ 4వ తేదీన జరిగినప్పటికీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిందనే విషయం తెలియాల్సి ఉంది.
కాగా, తనను సదరు ప్రొఫెసర్ నిత్యం వేధించేవాడని ఆమె చెబుతోంది. దీనికి సంబంధించి కేసు నమోదయింది. పోలీసులు అతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతను బెయిల్ పైన ఉన్నాడు. మరోవైపు, ఆ మహిళా ప్రొఫెసర్ తనకు తానే కళాశాలకు బంద్ అయ్యారు. మరో కళాశాలలో పని చేస్తున్నారు.












Click it and Unblock the Notifications