దారుణం: కారులోంచి లాగేసి మహిళపై భర్త ఎదుటే రేప్

గుర్గావ్: గుర్గావ్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల మహిళను కారులోంచి కిందకు లాగి భర్త, బావమరిది చూస్తుండగా ఆమెపై అత్యాచారం చేశారు. పురుషులిద్దరికీ తుపాకులు గురిపెట్టి వారిని బెదిరించి వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఆదివారం రాత్రి ఆ సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనలో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఓ వేడుకకు హాజరై మహిళ బావమరిది కారులో తిరిగి వస్తోంది. సెక్టార్ 56లని బిజినెస్ పార్క్ టవర్ వద్ద కారును ఆపారు.

 ఇలా కారు ఆపడంతో..

ఇలా కారు ఆపడంతో..

మహిళ భర్త మూత్రవిసర్జనకు కారు దిగాడు. వారికి సమీపంలో రెండు కార్లు ఆగాయి. నలుగురు వ్యక్తులు వాటిలో వచ్చారు. మద్యం సేవించినట్లున్నారు. వారు కార్లు దిగి కారు ఎందుకు అపారంటూ నిలదీశారు. మహిళ భర్తను వారు తోసేశారు.

మహిళను లాగి, పొదల్లోకి తీసుకెళ్లి..

మహిళను లాగి, పొదల్లోకి తీసుకెళ్లి..

కారు లోపల మహిళ ఉన్న విషయాన్ని గమనించి, ఒకతను ఆమెను బయటకు లాగాడు. ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగేంత వరకు మిగతా ముగ్గురు ఆమె భర్తకు, బావమరిదికి తుపాకులు గురిపెట్టి బెదిరించారు.

 ఆ తర్వాత హెచ్చరికలు..

ఆ తర్వాత హెచ్చరికలు..

ఆ తర్వాత పారిపోతూ పోలీసులకు చెప్తే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు. దుండగులు వచ్చిన రెండు కార్లలోని ఓ కారును నెంబర్‌ను మహిళ భర్త గుర్తు పెట్టుకోగలిగాడు. దాంతో పోలీసులు సోమవారంనాడు దుండగులను గుర్తించగలిగారు.

 వారిని పోలీసులు ఇలా పట్టుకున్నారు...

వారిని పోలీసులు ఇలా పట్టుకున్నారు...

మహిళపై అత్యాచారం చేసిన వ్యక్తిని వాటర్ ట్యాంకర్ సప్లయర్‌గా తెలుస్తోంది. గుర్గావ్‌లోని సోహ్నా సమీపంలో గల జోహాల్కా గ్రామంలోని ఇంటిలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసులను నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+