కోర్టుకెళ్తే..నిలువునా తగులబెడతాం: గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటికి కరపత్రం..!
లక్నో: వరుస అత్యాచారాలు, హత్యోదంతాలతో అట్టుడుకిపోతున్న ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వెళ్తే.. ఉన్నవ్ తరహాలో కిరోసిన్ పోసి, నిలువునా తగులబెడతామని అత్యాచార బాధితురాలికి హెచ్చరించారు నిందితులు. ఈ మేరకు వారు బాధిత యువతి ఇంటికి కరపత్రాలను అతికించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్ పట్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బాగ్ పట్ జిల్లాకు చెందిన బాధిత యువతి కొన్నేళ్లుగా దేశ రాజధానిలోని ముఖర్జీ నగర్ లో నివసిస్తోంది. గత ఏడాది అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో బాధిత యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి, న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు.

ప్రస్తుతం ఆ కేసు విచారణ దశలో ఉంది. విచారణలో భాగంగా- బాధిత బాలిక శుక్రవారం న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిందితులు దుస్సాహసానికి ఒడిగట్టారు. న్యాయస్థానానికి హాజరు కావడానికి వెళ్తే.. దారుణ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉన్నవ్ కంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. ఉన్నవ్ బాధితురాలి తరహాలో మార్గమధ్యలోనే కిరోసిన్ పోసి తగులబెడతామని అంటూ.. బాధితురాలి ఇంటికి కరపత్రాలను అతికించారు.

వాటిని చూసిన వెంటనే- బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాగ్ పట్ జిల్లా బాధితురాలి గ్రామానికే చెందిన సోహన్ సింగ్ అనే యువకుడిని అరెస్టు చేశామని డీసీపీ గోపేంద్ర తెలిపారు. బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో బాధితురాలికి కట్టుదిట్టమైన భద్రత మధ్య న్యాయస్థానాకి తీసుకెళ్తామని చెప్పారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications