ఉద్యోగం ఇచ్చి షోరూంలో మహిళపై రేప్ చేశాడు

ఓ యువతి పేపర్లో ప్రకటన చూసి సదరు ఆప్టికల్ షోరూంలో సేల్స్ గర్ల్‌గా ఉద్యోగం కోసం ప్రయత్నించింది. సోమవారం ఇంటర్వ్యూకు వెళ్ళగా ఎంపికైంది. మంగళవారం 10 గంటలకు షోరూంకు రావాలని యజమాని దీపక్ మల్హోత్రా (61) ఆ యువతికి సూచించాడు. ఆమె చెప్పిన సమయానికే షోరూంకు వెళ్ళగా, అరగంట తర్వాత వచ్చిన మల్హోత్రా ఆమెను తన చాంబర్లోకి పిలిచాడు.
అక్కడ అతడు ఇచ్చిన మంచినీళ్ళు తాగగానే ఆమె స్పృహ కోల్పోయింది. అరగంట తర్వాత లేచి గమనిస్తే రేప్‌కు గురైనట్టు బాధితురాలు అర్థం చేసుకుంది. వెంటనే వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ముసలి కీచకుడిని అరెస్టు చేశారు.
కాగా, సదరు యువతి రెండేళ్ళ క్రితం విడాకులు తీసుకుని, ప్రస్తుతం ప్రేమికుడితో కలిసి బుద్ధవిహార్ ప్రాంతంలో నివసిస్తోంది. ఇక, రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్హోత్రా పశ్చిమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇతనికి రెండు ఆప్టికల్ షోరూంలున్నాయి.












Click it and Unblock the Notifications