లిఫ్ట్ పేరుతో ఎత్తుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం

ఆమె వెళ్తుండగా ముగ్గురు యువకులు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. అనంతరం ఆమెను బలవంతంగా ఫతెహుల్లాపూర్ ప్రాంతంలోని ఓ ఇంటికి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమెకు మత్తు మందుతో కూడిన కూల్ డ్రింక్ ఇచ్చారు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది.
ఆ తర్వాత ఆ ముగ్గురు యువకులు ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై ముగ్గురు యువకుల పైన కేసు నమోదు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు... మహిళపై అత్యాచారం చేసిన అనంతరం యువకులు ఆమెను తమ కారులో తీసుకెళ్లారు. హపుడ్ గ్రామంలో వారు కారులో నుండి కిందకు తోసేశారు. కాగా, లిఫ్ట్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేసిన వారిలో ఒకరు బాధితురాలికి తెలిసిన వారే. ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications