మంచి ఉద్యోగం ఇస్తామని నమ్మించి మహిళపై సామూహిక అత్యాచారం

మంచి ఉద్యోగం ఇస్తామని ఆశచూపి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికురాలిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని గురుగ్రామ్ లో చోటుచేసుకొంది.

గురుగ్రామ్: మంచి ఉద్యోగం ఇస్తామని ఆశచూపి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికురాలిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని గురుగ్రామ్ లో చోటుచేసుకొంది.

బిలాస్ పూర్ అనే గ్రామం వద్ద ఆరుగురు కీచకులు లైంగికదాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే మంచి ఉద్యోగం కల్పిస్తామని ఆశచూపి ఈ దారుణానికి ఒడిగట్టారు.

Woman raped by six with job ruse in Gurugram

మానేసార్ లో మంచి ఉద్యోగం ఉందని ఆ వివరాలు తెలుసుకొనేందుకుగాను ఐఎంటీ చౌరస్తా వద్దకు బాధితురాలిని రావాలని చెప్పారు. మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో బాధితురాలిని తెలిసిన వ్యక్తి పిలిచాడు.అతని మాటలను నమ్మిన ఆ యువతి అతను చెప్పిన ప్రాంతానికి చేరుకొంది.

సూపర్ వైజర్ వచ్చి తీసుకెళ్తాడని బాధితురాలిని ఖల్లు అనే వ్యక్తి నమ్మించాడు. 15 నిమిషాల తర్వాత సూపర్ వైజర్ గా చెప్పుకొంటున్న ఓ వ్యక్తి బైక్ పై ఎక్కించుకొని తన కంపెనీకి తీసుకెళ్ళకుండా బిలాస్ పూర్ కు సమీపంలోని శంకర్ దాని అనే గ్రామానికి తీసుకెళ్ళాడని బాధితురాలు చెప్పింది.

అప్పటీకీ అక్కడ ఓ గదిలో ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత మరో ముగ్గురు కూడ వచ్చారు. తనను ఆరుగురు గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పారు. రాత్రంతా గదిలోనే బంధించారని బాధితురాలు చెప్పింది.

ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించారు.కానీ, ఉదయం 6 గంటల సమయంలో నిందితుల నుండి తప్పించుకొని పారిపోయి వచ్చానని బాధితురాలు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+