నిరసనలతో అట్టుడుకుతున్న ప్రాంతానికి బుర్ఖాతో వెళ్లిన మహిళా విలేెకరి: దాడికి యత్నం.. !

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని షహీన్ బాగ్ వద్ద బుధవారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. షహీన్ బాగ్ వద్ద ఆందోళనకారులు చేపట్టిన నిరసన ప్రదర్శనలను కవర్ చేయడానికి ఓ మహిళా విలేకరి బుర్ఖా వేసుకుని వెళ్లారు. ఆమె ప్రవర్తన తీరుపై ఆందోళనకారులకు అనుమానం రావడంతో అడ్డుకున్నారు. బుర్ఖా తొలగించారు. ముస్లిమేతర మహిళ అని తెలుసుకున్న అనంతరం దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనతో షహీన్ బాగ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆ మహిళా విలేకరి పేరు గుంజా కపూర్. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు నిరసనగా ఆందోళనకారులు కిందటి నెల 26వ తేదీ నుంచి ఏకధాటిగా షహీన్ బాగ్ వద్ద ఆందోళనలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకూ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో రెండు రోజులుగా ఆందోళనకారులు తమ నిరసనను మరింత తీవ్రతరం చేశారు.

Woman reporter Gunja Kapoor disguises self in burqa, police escort her out

ఈ పరిణామాల మధ్య బుధవారం ఉదయం గుంజా కపూర్.. అక్కడి పరిస్థితులను కవర్ చేయడానికి బుర్ఖా వేసుకుని వెళ్లారు. ఆందోళనకారులతో కలిసి పోయారు. అనంతరం ఆమె ప్రవర్తన, మాట తీరు పట్ల కొందరు నిరసనకారుల్లో అనుమానాలు తలెత్తాయి. ఇదే విషయంపై గుంజా కపూర్‌ను నిలదీశారు. దీనితో తడబాటుకు గురైన ఆమె నిరసనకారులు సంధించిన ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వలేకపోయారు. ఫలితంగా- వారిలో అనుమానాలు మరింత బలపడ్డాయి.

గుంజా కపూర్‌ను చుట్టుముట్టి, బుర్ఖాను తొలగించారు. ఆమె ముస్లిమేత మహిళ అని తెలుసుకున్న అనంతరం దాడికి ప్రయత్నించారు. అక్కడి పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ వదల్లేదు. దీనితో ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. గుంజా కపూర్‌కు భద్రత కల్పించారు. ఆందోళనకారుల మధ్య చిక్కుకుపోయిన ఆమెను సురక్షితంగా తరలించారు. గుంజా కపూర్ రైట్ నెరేటివ్ అనే యుట్యూబ్ ఛానల్‌లో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+